Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక చీకటిలో కలిసిపోనున్న విక్రమ్ ల్యాండర్... మైనస్ 200 డిగ్రీల్లో...

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (14:01 IST)
చంద్రయాన్-2 ప్రాజెక్టుపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆశలు వదులుకున్నట్టుగా తెలుస్తోంది. శనివారం ఉదయంతో చంద్రుడిపై లూనార్‌ పగలు ముగిసింది. దీంతో మరో 14 రోజులపాటు దక్షిణ ధ్రువంపై చీకటి పరుచుకుంటుంది. పైగా ఈ కాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 200 డిగ్రీలకు పైనే నమోదవుతాయి. 
 
ఈ పరిస్థితులను తట్టుకునే శక్తి విక్రమ్‌ ల్యాండర్‌, అందులోని ప్రజ్ఞాన్‌ రోవర్‌లకు లేదు. దీంతో దీని కథ ముగిసినట్టే అన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. మళ్లీ 14 రోజుల తర్వాత లూనార్‌ పగలు మొదలయ్యాక ఆర్బిటర్‌ కెమెరా నుంచి పరిశీలించి విక్రమ్‌ జాడ కనుక్కునే ప్రయత్నం చేసినా అప్పటికే అది నిర్వీర్యమై ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు.
 
ఇదిలావుండగా, ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దిగే క్రమంలో నియంత్రణ కోల్పోయి (హార్డ్ ల్యాండింగ్) ఒరిగిపోయింది. ఈ విక్రమ్‌లోని ఆటోమెటిక్‌ ల్యాండింగ్‌ ప్రోగ్రామ్‌(ఏఎల్‌పీ) విఫలం కావడంతో బ్రేక్‌లుగా పనిచేయాల్సిన థ్రస్టర్లు యాక్సెలరేటర్లుగా పనిచేసి ఒక్కసారిగా వేగాన్ని పెంచి ఉండొచ్చని ఇస్రోవర్గాలు చెబుతున్నాయి. 
 
ఈ కారణంగానే గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్‌ ఢీకొని ఉండొచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ శాస్త్రవేత్త చెప్పారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా విక్రముడితో అనుసంధానం తెగిపోయిందని ఇస్రో ప్రకటించినా.. ఇంచుమించు 330 మీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన జరిగిందన్నారు.
 
ఏఎల్‌పీ సిద్ధం చేసిన నిపుణుల బృందం ప్రయోగానికి ముందు ప్రోగ్రామ్‌ను పునఃసమీక్షించుకొనివుంటే ఇలా జరిగేది కాదని ఇంకొందరి శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ల్యాండర్‌ 'విక్రమ్' జాడను సూచించే పలు దృశ్యాలను నాసా శుక్రవారం విడుదల చేసింది. వీటిని తమ రోబోటిక్‌ అంతరిక్ష వాహనం లూన్‌ రీకనైజాన్స్‌ ఆర్బిటర్‌(ఎల్‌ఆర్‌వో) చిత్రీకరించిందని తెలిపింది. 
 
అయితే ఆ చిత్రాల్లో చంద్రుడి ఉపరితలం చీకటిగా కనిపిస్తుండటంతో ల్యాండర్‌ నిర్దిష్ట ల్యాండింగ్‌ ప్రదేశాన్ని కనుగొనడం పెనుసవాలుగా మారింది. చంద్రుడిపై 'విక్రమ్' ల్యాండర్‌ జీవితకాలం 14 రోజులే. 7న క్రాష్‌ ల్యాండింగ్‌ జరిగినందున శనివారంతో దాని జీవితకాలం ముగియనుంది. ఇక ఆదివారం నుంచి చంద్రుడిపై రాత్రికాలం ప్రారంభమైతే ల్యాండర్‌పై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవిగారు జపాన్ వెళ్లారు. రాగానే జీబ్రా చూస్తారు : హీరో సత్యదేవ్

రాజకీయనాయకుల బిల్డప్ షాట్ లు ఎలా వుంటాయో చెప్పిన కె.సి.ఆర్. రాకింగ్ రాకేష్

ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు మురారి ఫీలింగ్ వచ్చింది : అశోక్ గల్లా

పెళ్లి చూపులు టైంలో ఈ స్థాయికి వస్తామనుకోలేదు : విజయ్ దేవరకొండ

క్రేజీ ఎంటర్‌టైనర్‌గా రామ్ పోతినేని 22వ చిత్రం పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments