Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... నాకు నారా లోకేష్ ఛాంబరా? వద్దు బాబోయ్ అంటూ ఏపీ మంత్రి

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (18:39 IST)
నారా లోకేష్... ఏపీ మాజీ మంత్రి. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఘోర పరాజయం పాలయ్యారు. తండ్రి చంద్రబాబు నాయుడు మెజార్టీ కాస్తాకూస్తో తగ్గినా విజయం సాధించారు కానీ కుమారుడు లోకేష్ మాత్రం పోటీలో నిలవలేకపోయారు. ఇప్పుడు మరోసారి నారా లోకేష్ వార్తల్లోకి వచ్చారు.
 
అదెలాగో చూద్దాం. వైసీపికి చెందిన కొత్త మంత్రులు వరుసబెట్టి మంచి ముహూర్తం చూసుకుంటూ సచివాలయంలో ఆయా ఛాంబర్లలోకి వెళ్తున్నారు కదా. మొత్తం 25 మంత్రులకు అధికారులు ఆయా ఛాంబర్లను కేటాయించారు. దాంతో వారివారి ఛాంబర్లలోకి ప్రవేశిస్తున్నారు మంత్రులు. ఐతే ప్రత్యేకించి ఓ మంత్రి మాత్రం తనకు కేటాయించిన ఛాంబర్ గది 188 చూసి జడుసుకున్నారట. తనకు ఆ ఛాంబర్ వద్దు బాబోయ్ అని చెప్పారట.
 
ఇంతకీ ఆ ఛాంబర్ ఎవరిదయా అంటే... గతంలో అది మాజీ మంత్రి నారా లోకేష్ బాబుది. ఈ ఛాంబర్‌ను ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అధికారులు కేటాయించారట. విషయం తెలుసుకున్న మంత్రిగారు తనకు ఆ ఛాంబర్ వద్దుబాబోయ్ అంటూ చెప్పారట. దాంతో ఆయనకి సచివాలయంలోని 3వ బ్లాక్‌లోని 203 రూమ్‌ను ఛాంబర్‌గా కేటాయిస్తూ ఏర్పాట్లు చేశారట. అదీ సంగతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments