సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్కే రోజాను అసెంబ్లీ స్పీకర్ చేద్దామనుకున్నారు. చంద్రబాబు నాయుడు చేత అధ్యక్షా అని పిలిపించుదామని అనుకున్నారు. కానీ రోజా స్పీకర్ పదవిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవి తీసుకోవాలని విజయసాయి రెడ్డి ఎంతగానో చెప్పి చూసినట్లు సమాచారం.
ఈ విషయంపై రోజాను ఒప్పించేందుకు ప్రకాష్ ద్వారా రాయబారం నడిపారు. నిన్న ఉదయం వరకూ దీనిపైనే రోజాను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఐతే ఆమె ఆ పదవికి ససేమిరా అనడంతో మంత్రి మండలిలోనూ ఛాన్స్ లేకుండా పోయినట్లు చెపుతున్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో రోజా అలిగి వెళ్లిపోయినట్లు సమాచారం. మొత్తమ్మీద పదవుల పందేరంలో జగన్ మోహన్ రెడ్డి తను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేశారు.