Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురళీ మోహన్ కంపెనీ జయభేరీ కన్‌స్ట్రక్షన్స్ పైన ఏపీ ప్రభుత్వం భారీ జరిమానా

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (21:38 IST)
ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్‌కు చెందిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్ కు అధికారులు భారీ జరిమానా వడ్డించారు. అమరావతిని ఆనుకుని ఉండే కుంచనపల్లిలో జయభేరి కన్‌స్ట్రక్షన్స్ నిర్మించిన భవనాలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న అధికారులు రూ.1.5 కోట్లు జరిమానాగా విధించారు.
 
జాతీయ రహదారి పక్కనే ఉండే కుంచనపల్లిలో 7 ఎకరాల 5 సెంట్ల భూమిని కొనుగోలు చేసిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్ 2016లో నిర్మాణాలు చేపట్టింది. అయితే, ఇది వ్యవసాయ భూమి కాగా దీంట్లోనే నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో నిబంధనలు పాటించలేదని జయభేరి కన్‌స్ట్రక్షన్స్ పై ప్రస్తుత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
 
రంగంలోకి దిగిన అధికారులు 3 శాతం ల్యాండ్ కన్వర్షన్ ఫీజుతో పాటు జరిమానా కూడా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకు రూ.1 కోటి, అపరాధ రుసుం కింద మరో రూ.50 లక్షలు చెల్లించాలని జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌ను ఆదేశించారు. ఈ జరిమానాను జయభేరి సంస్థ చెల్లించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం