కర్ణాటకలో ఇంత దారుణమా.. ఆ పెద్ద మనుషులెక్కడ : చంద్రబాబు

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయాలు చూస్తే కడుపు రగిలి పోతుందనీ, ఇంత దారుణమా అంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో చోటుచేసుకున్

Webdunia
శనివారం, 19 మే 2018 (13:21 IST)
కర్ణాటకలో జరుగుతున్న రాజకీయాలు చూస్తే కడుపు రగిలి పోతుందనీ, ఇంత దారుణమా అంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో చోటుచేసుకున్న రాజకీయాపరిణామాలపై స్పందించారు.
 
కర్ణాటకలో పరిస్థితి దారుణంగా ఉందని, అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తున్నారని విమర్శించారు. బీజేపీకి మెజారిటీ లేకున్నా అధికారం చేజిక్కించుకునేందుకు వీలైనన్ని అడ్డదారులు తొక్కుతుందన్నారు. 
 
గతంలో తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కూడా బీజేపీ ఇదేవిధంగా ప్రవర్తించిందని, ఇప్పుడు కర్ణాటకలో మళ్లీ ఇదే వ్యవహారానికి పాల్పడుతోందని తూర్పారబట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లో గవర్నర్లు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. గవర్నర్ల వ్యవస్థను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందన్నారు. 
 
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీపై కేంద్రం కన్నుపడుతోందని, ఎన్నికల ముందు మోడీ-అమిత్ షా ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పిన ఆ పెద్ద మనుషులు ఇపుడు ఎక్కడ ఉన్నారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments