Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోదావరి లాంచీ మునక: చంద్రబాబు ఏమన్నారు..? సిమెంట్ బస్తాలు తెచ్చారట..

గోదావరి లాంచీ మునక ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. గోదావరి లాంచీ మునక ప్రమాదంలో 22 మంది మృతి చెందినట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందిస్తామ

Advertiesment
గోదావరి లాంచీ మునక: చంద్రబాబు ఏమన్నారు..? సిమెంట్ బస్తాలు తెచ్చారట..
, బుధవారం, 16 మే 2018 (17:52 IST)
గోదావరి లాంచీ మునక ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. గోదావరి లాంచీ మునక ప్రమాదంలో 22 మంది మృతి చెందినట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందిస్తామని.. తక్షణ సాయం కింద లక్షరూపాయలు ఇస్తామన్నారు.


వాడపల్లిలో జరుగుతున్న సహాయక చర్యలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులతో కలిసి పర్యవేక్షించిన అనంతరం మీడియా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇద్దరు బాలురతో పాటు 12 మంది మృతదేహాలను వెలికితీశారని.. మరో పది మృతదేహాలను వెలికి తీయాల్సి వుందని చంద్రబాబు అన్నారు. 
 
ఇప్పటివరకు ఇద్దరు బాలురు సహా 12 మంది మృతదేహాలు వెలికితీశారని, మరో 10 మృతదేహాలను వెలికి తీయాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. లాంచీని మంగళవారం ఉదయం చెకింగ్‌ కూడా చేశారని, కానీ సాయంత్రం బోటు నడిపిన వారు సిమెంటు బస్తాలు తీసుకొచ్చారని.. అందుకే ప్రమాదం జరిగిందని చంద్రబాబు అన్నారు. లాంచీలో ఎన్ని సిమెంటు బస్తాలు వేశారో విచారణ చేస్తున్నామని, ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మరోవైపు గోదావరినదిలో మునిగిపోయిన లాంచీని భారీ క్రేన్ల సాయంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయటకు తీస్తున్నాయి.
 
ఇక గోదావరి లాంచీ మునక ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. రోజువారీ అవసరాలకి ఇతర ప్రాంతాలకి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జల సమాధి కావడం ఆందోళన కలిగించిందని, గుండె బరువెక్కిందని పవన్ తెలిపారు. 60 అడుగుల లోతున లాంచీ పడిపోయిందని తెలిశాక ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమైందని.. మృతుల కుటుంబాలకు పవన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకి శాపం కావద్దు. ఈ ఘటనలో సర్కార్ శాఖలు, ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని పవన్ విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు అది దోచేయడం బాగా తెలుసు: పవన్ కళ్యాణ్ విమర్శ