Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రానికి చంద్రబాబు షాక్... ఏపీలో సీబీఐకు నో ఎంట్రీ

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (14:19 IST)
కేంద్ర ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీతో తలపడేందుకు కాలు దువ్వుతున్నారు. ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశ అత్యున్నత నేర దర్యాప్తు సంస్థ సీబీఐకు ఏపీలో అడుగు పెట్టకుండా చర్యలు తీసుకున్నారు. 
 
సీబీఐకు అనుమతించిన కన్సెంట్‌ను విరమించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా సీబీఐపై ఏపీ సర్కారు కన్నెర్రజేసినట్టయింది. ఈ ఉత్తర్వులతో రాష్ట్రంలో సీబీఐ అనుమతి లేకుండా అడుగు పెట్టడానికి వీల్లేదు. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో సీబీఐ ఎటువంటి సోదాలు కానీ, దర్యాప్తు కానీ చేసే అధికారాన్ని కోల్పోయినట్టే. 
 
ఏదేని రాష్ట్రంలో సీబీఐ విచారణ చేయాలన్నా, కేసులు పెట్టాలన్నా ఆ రాష్ట్ర అనుమతి తప్పనిసరి. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీకి మినహాయింపు ఉంది. కానీ, చంద్రబాబు సర్కారు తాజాగా జారీచేసిన ఆదేశాలతో రాష్ట్రంలో సీబీఐ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోగానీ ఇతర కేంద్ర పబ్లిక్ సెక్టార్ సంస్థల్లోగానీ ఎలాంటి విచారణ చేయడానికి అర్హత లేదు. 
 
ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల సీబీఐ దాడులు నిర్వహించి, వ్యాపారస్థుల, రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే. దీనికితోడు రాష్ట్ర సర్కారు కేంద్రంతో అమీతుమీకి దిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కేంద్రానికి చురకలాంటిదని భావించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments