Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నిర్బంధంలో మనిషి : పక్షులు - జంతువులకు సంపూర్ణ స్వేచ్ఛ

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (21:11 IST)
ప్రకృతిని మనిషి బంధించాడనే విషయం ఇపుడు తేటతెల్లమైంది. ఒక మనిషిని స్వీయ నిర్బంధంలో ఉంచితే ప్రకృతిలోని అనేక జంతువులు, పక్షులు, వన్యప్రాణాలు, మృగాలకు ఎంత స్వేచ్ఛ వస్తుందో ఈ కరోనా నిరూపించింది. కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. దీంతో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. పైగా, మనిషి సృష్టించిన సాంకేతకత సంచారం కూడా తగ్గిపోయింది. ఇదే పక్షులు జంతువులు ఇప్పుడు స్వేచ్చగా సంచరించేలా చేస్తున్నాయి. తాజాగా ముంబైలో వలస పక్షులు ఫ్లెమింగోలు పండుగ చేసుకుంటున్నాయి.
 
ముంబైలోని అరేబియా సముద్రతీరం వెంబడి ఉండే చిత్తడి ప్రదేశాలకు ప్రతి ఏటా వేలసంఖ్యలో ఫ్లెమింగోలు వస్తుంటాయి. ఈసారి వాహనాలుగానీ, మనుషుల సంచారంగానీ లేకపోవటంతో లక్షల సంఖ్యలో వచ్చిన ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయి. గతేడాదికంటే ఈ సంవత్సరం 25 శాతం ఎక్కువ ఫ్లెమింగోలు వలసవచ్చాయని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్‌ దీపక్‌ ఆప్టే వెల్లడించారు.
 
ముంబై చుట్టుపక్కల ప్రస్తుతం లక్షన్నరదాకా ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇవి గుజరాత్‌లో ఖచ్‌ నుంచి, రాజస్థాన్‌లోని సాంబార్‌ సరస్సుతోపాటు పాకిస్థాన్‌, ఆప్ఘనిస్థాన్, ఇజ్రాయేల్‌ దేశాల నుంచి కూడా వలస వస్తాయని గుర్తుచేశారు. ఈ ఫ్లెమింగోల ఫోటోలను బాంబే నాచురల్‌ హిస్టరీ సొసైటీ ట్విటర్‌లో పోస్టు చేయటంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తెగలైకులు కొడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments