Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ ... గ్రామ సచివాలయ సిబ్బంది 'జల్సా' పార్టీ

లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ ... గ్రామ సచివాలయ సిబ్బంది 'జల్సా' పార్టీ
, గురువారం, 23 ఏప్రియల్ 2020 (14:50 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, వచ్చే నెల మూడో తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోవుండనుంది. ఈ సమయంలో అత్యవసర సేవలు మినహా ఇతర సేవలు ఒక్కటీ అందుబాటులో వుండవు. కానీ, కొంతమంది జులాయ్‌లు ఈ లాక్‌డౌన్ ఆంక్షలను బ్రేక్ చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వ సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 
 
తాజాగా, గ్రామ సచివాలయ ఉద్యోగులు కొంతమంది కలిసి జల్సా పార్టీ చేసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి ఈ చర్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా సాఖినేటిపల్లి మండలం, కేశవదాసుపాలెం గ్రామ శివారుల్లో జరిగింది. 
 
కొంతమంది గ్రాస సచివాలయ ఉద్యోగులు కలిసి ఈ పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు. పైగా, దీన్ని వీడియో తీసి తమ స్నేహితుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకోవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఇది వైరల్ అయింది. కాగా, ఇటీవల ఇదే జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఓ గ్రామ వలంటీరు పుట్టినరోజు వేడుకలను జరుపుకోగా, 28 మంది హాజరయ్యారు. దీంతో వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా రక్కసి గుప్పెట్లో కర్నూలు - కొత్తకా మరో 31 కేసులు