స్క్రీన్‌‌ను బద్దలు కొట్టుకొని సింహం బయటికి వస్తే..?

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (10:21 IST)
Lion
సాంకేతికత పరంగా ప్రపంచం దూసుకుపోతోంది. నమ్మలేని విషయాలను కళ్ల ముందుకు తెస్తోంది. అలాంటిదే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా చైనా, ఉత్తరకొరియా రోడ్లపై ఏర్పాటు చేసిన స్క్రీన్లను చూసి అక్కడి వారు నిత్యం ఆశ్చర్యపోతున్నారు.

చైనాలోని చెంగ్డూలో ఏర్పాటు చేసిన ఓ 3డీ డిస్​ప్లేను చూసిన మహిళ పరుగులు పెట్టింది. హఠాత్తుగా స్కీన్ లోపల ఉన్న సింహం బయటకు వచ్చినట్టు అనిపించింది. చూసేందుకు ఆ 3డీ వీడియో అలానే ఉంది. స్క్రీన్‌‌ను బద్దలు కొట్టుకొని సింహం బయటికి వచ్చినట్టు అనిపించడంతో ఆమె పరుగెత్తింది. ఈ వీడియో వైరల్​గా మారింది.
 
ఇక గువాన్​యిన్​క్వియాలో ఏర్పాటు చేసిన స్క్రీన్లలో ప్రదర్శించిన ఫ్లయింగ్ సాసర్​ 3డీ వీడియోలు సైతం అబ్బురపరుస్తున్నాయి. రైలు, విమానాలు ఇలా ఆ డిస్​ప్లేల్లో కనిపించే ప్రతి ఒక్కటి తమ మధ్యలోకి వస్తున్నాయేమో అన్నట్టు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా కళ్లకు ఎలాంటి ప్రత్యేకమైన అద్దాలు లేకుండా ఈ త్రీడీ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తుండడం ప్రత్యేకత. ఇలాగే 2020లో సౌత్ కొరియాలో ఏర్పాటు చేసిన ఓ 3డీ డిస్​ప్లే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి నా ఫోటోలు కాదు.. ఏఐ సృష్టించిన చిత్రాలు.. రుక్మిణి వసంత్

Lenin Teaser: అఖిల్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా లెనిన్ టీజర్ వచ్చేసింది

Chiru 158 Update: నివేథా పేతురాజ్ మాస్టర్ కు పాఠాలు చెబుతుందా?

Ramcharan: నా కూతురిని ఎత్తుకున్నా నొప్పి పెడుతుంది : రామ్ చరణ్

ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు : యువసామ్రాట్

తర్వాతి కథనం
Show comments