Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉడుతకు దాహం వేస్తే.. ఎదురుగా వాటర్ బాటిల్ కనిపిస్తే? (video)

Webdunia
శనివారం, 18 జులై 2020 (11:34 IST)
Thirsty squirrel
దాహం వేస్తే నాలుక పిడచకట్టుకుపోతుంది. దాహం అనేది మనుషులకే కాదు.. జంతువులు, పక్షలు, ఇతర జీవులకు కూడా వేస్తుంది. దాహం వేస్తే వెంటనే నీళ్లు తాగాలనిపిస్తుంది. మనుషులకు దాహం వేస్తే చెప్పగలుగుతారు. కానీ జంతువులు, పక్షులు దాహం వేస్తే చెప్పలేవు. ఇలాంటిదే దాహం వేసిన ఓ ఉడుత నీటి కోసం అలమటించింది.
 
దాహం వేసి నాలుక పిడచకట్టుకుపోవడంతో ఓ ఉడుత నీళ్ల కోసం చేసిన పోరాటం నెటిజన్లను ఆకర్షిస్తోంది. మనిషికి దండం పెడుతూ.. వెంటపడింది. నీరు పోసే వరకు వెంట తిరిగి తీరా దాహార్తి తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
 
రోడ్డుపై నీళ్ల బాటిల్ తీసుకొని వెళ్తున్న ఓ యువ జంటను ఉడుత గమనించింది. దానిలో నీరు కనిపించడంతో అది ఆ యువకుడి వెంట పడింది. వెనక కాళ్లపై పైకి లేస్తూ.. ప్లీజ్ నీళ్లు పోయండి అన్నట్టుగా ప్రాధేయపడింది. 
 
ముందుగా ఆ యువకుడికి అది ఎందుకు వెంటపడుతోందో అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకున్నాడు. తన చేతిలోని నీటిని దానికి తాగించగా, దప్పిక తీర్చుకొని వెళ్లిపోయింది. నీళ్ల కోసం ఆ ఉడుత చేసిన సైగలు పలువురి హృదయాలను కట్టిపడేసింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments