ఎన్టీఆర్‌పై చెప్పులు వేసింది లక్ష్మీపార్వతి మనుషులే-శివాజీ

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (11:13 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా ''లక్ష్మీస్ ఎన్టీఆర్''. ఈ సినిమాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులోని వెన్నుపోటు పాటపై తెలుగుదేశం పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. అయినా వారికి వర్మ కౌంటరిచ్చారు. తాజాగా ఈ సినిమాపై సినీ నటుడు శివాజీ హాట్ కామెంట్స్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీపార్వతి చీకటి రోజుల్లో ఎన్టీఆర్ జీవితంపై తీస్తున్న సినిమాగా భావిస్తున్నానన్నారు. 
 
ఈ సినిమాలో వర్మ వైశ్రాయ్ హోటల్ ఉదంతం కూడా ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్‌కి తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పిన శివాజీ.. అప్పుడు ఎన్టీఆర్‌పై చెప్పులు వేసింది లక్ష్మీపార్వతి మనుషులేనని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వైశ్రాయ్ ఎపిసోడ్‌కు కొత్త కోణం ఇచ్చిన శివాజీ... అది వెన్నుపోటు కాదని, వెన్నుదన్ను అన్నారు.
 
చంద్రబాబు ఆరోజు అలా చేయకపోతే టీడీపీనే కాదు.. బీజేపీ కూడా ఉండేది కాదని చెప్పుకొచ్చారు. సుగ్రీవుడి కోసం రాముడు ఏం చేశాడో.. టీడీపీ కోసం, ఏపీ కోసం చంద్రబాబు కూడా అదే చేశారని అన్నారు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని చెబుతూనే.. బాబును సమర్థించారు. వెన్నుపోటు, వెన్నుదన్నుకు తేడా తెలియని వర్మ ఎలాంటి సినిమా తీస్తాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని శివాజీ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

తర్వాతి కథనం
Show comments