Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెడ్‌పై హరికృష్ణ పార్థివదేహం. సెల్ఫీ దిగిన అనాగరిక సిబ్బంది... తిక్క కుదిర్చిన యాజమాన్యం

నల్గొండ జిల్లా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీనియర్ నటుడు హరికృష్ణ కామినేని ఆస్పత్రిలో చనిపోయారు. అయితే, ఆయన పార్థివదేహాన్ని ఓ గదిలో బెడ్‌పై ఉంచారు. ఆ సమయంలో కొందరు అనాగరిక మనుషులు (సిబ్బం

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (11:47 IST)
నల్గొండ జిల్లా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీనియర్ నటుడు హరికృష్ణ కామినేని ఆస్పత్రిలో చనిపోయారు. అయితే, ఆయన పార్థివదేహాన్ని ఓ గదిలో బెడ్‌పై ఉంచారు. ఆ సమయంలో కొందరు అనాగరిక మనుషులు (సిబ్బంది) హరికృష్ణ పార్థివదేహంతో సెల్ఫీ దిగారు. అనంతరం తామేదో ఘనకార్యం చేసినట్టుగా ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో నెటిజిన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విషయం కామినేని ఆస్పత్రి యాజమాన్యానికి చేరింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన యాజమాన్యం.. ఈ సెల్ఫీ పిచ్చోళ్లను విధుల నుంచి తొలగించింది.
 
తమ సిబ్బంది చేసిన పని కారణంగా హరికృష్ణ కుటుంబ సభ్యులకు.. అభిమానులకు ఆసుపత్రి క్షమాపణలు కోరింది. ఇదే విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. 'మా కామినేని ఆసుపత్రులలో మేం మా రోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల్ని చాలా గోప్యంగా ఉంచుతాం. కానీ.. మా సిబ్బందిలో కొందరు చేసిన తప్పిదం కారణంగా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లింది. ఇది మా ఆసుపత్రి యొక్క గోప్యతపై ప్రధాన దాడిగా మేం అర్థం చేసుకున్నాం. మా సిబ్బందిలో కొందరు అనాగరిక.. అమానుష ప్రవర్తన వల్ల ఈ తప్పిదం జరిగింది. 
 
ఈ విషయాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందుకు కారణమైన వారిపై చర్యలకు సంబంధిత అధికారులకు సమాచారం అందించాం. ఈ తప్పిదంలో పాల్గొన్న సిబ్బందిని మేం తగిన చర్యలు తీసుకొని తొలగించటం జరిగింది. ఇటువంటివి మళ్లీ జరుగకుండా ఉండటానికి వీలుగా తగు చర్యలు తీసుకుంటాం. మా ఆసుపత్రిలో పని చేసే కొందరి తప్పిదానికి.. మా ఆసుపత్రి తరపున హరికృష్ణగారికి, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మా హృదయపూర్వక క్షమాపణలు తెలుపుతున్నాం అంటూ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments