Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె పీజీ.. ఆగర్భ శ్రీమంతురాలు : అతను అప్పర్ ప్రైమరీ.. ట్యాంకర్ డ్రైవర్

ప్రేమ ఎపుడు.. ఎలా.. ఎందుకు.. ఎవరిపై చిగురిస్తుందో తెలియదు. ఈ విషయం ప్రేమలో పడిన వారిని అడిగినా కూడా చెప్పలేరు. అలాంటి సంఘటనే ఇపుడు ఒకటి హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఆమె వయసు 24 యేళ్లు. చదువు ఎంబీ

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (11:33 IST)
ప్రేమ ఎపుడు.. ఎలా.. ఎందుకు.. ఎవరిపై చిగురిస్తుందో తెలియదు. ఈ విషయం ప్రేమలో పడిన వారిని అడిగినా కూడా చెప్పలేరు. అలాంటి సంఘటనే ఇపుడు ఒకటి హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఆమె వయసు 24 యేళ్లు. చదువు ఎంబీఏ. అతని వయసు 19 యేళ్లు. అప్పర్ ప్రైమరీ విద్య. ఆమె ఆగర్భ శ్రీమంతురాలు అయితే అతను వాటర్ ట్యాంకర్ డ్రైవర్. పైగా, ఆ యువతి నివాసం ఐదంతస్తుల లగ్జరీ హౌస్. కుర్రోడు ఉండేది ఓ రేకుల షెడ్డులో. అలాటి వారిద్దరి ప్రేమ చిగురించింది. ఇరువురి హృదయాలను ఒక్కటి చేసింది.
 
తన ఇంటికి వాటర్‌ ట్యాంకర్‌తో నీళ్లు తీసుకొచ్చే క్రమంలో ఆ యువతితో యువకుడికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది. ఆరు నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరూ కలిసి చెప్పాపెట్టకుండా ఇళ్లలోంచి లేచిపోయారు. దీంతో మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆ యువ ప్రేమికులను గుర్తించారు. హఫీజ్‌పేట్‌లో ఉంటున్న వీరిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ వయసు నిర్ధారణ చేయగా ఆమె మేజర్‌ అని తేలింది. కానీ, అతని వయసు 19 కావడంతో మైనర్‌గా తేలింది. ఇద్దరీ కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి ఇళ్లకు వారిని పంపించారు. ఆ యువతి మాత్రం వయసులో చిన్నవాడే అయినప్పటికీ అతనే నా చెలికాడు అంటూ పోలీసుల ముందే తల్లిదండ్రులకు స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments