Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్పను దర్శించుకున్న మహిళ భర్త పరార్.. నెటిజన్లు మండిపాటు

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (12:42 IST)
శబరిమల అయ్యప్ప స్వామిని ఇద్దరు మహిళలు దర్శించుకున్న నేపథ్యంలో.. పూజారులు, భక్తులు గర్భగుడికి తాళం వేశారు. 50 వయస్సులోపు వున్న ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారుజామున శబరిమలకు వచ్చి పోలీసుల సాయంతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడంపై.. భక్తులు మండిపడుతున్నారు. 
 
ఇద్దరు మహిళలు పోలీసుల సాయంతో బుధవారం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిర్ధారించారు. అయితే అయ్యప్ప ఆలయంలోకి మహిళా భక్తులను పంపి.. కేరళ సర్కార్ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 
బుధవారం తెల్లవారు జామున మాత్రం 40ఏళ్ల వయసుగల బింధు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు.. ఆలయంలోకి ప్రవేశించారు. స్వామి వారిని దర్శించుకొని బయటికి నృత్యాలు చేశారు. వీరు అయ్యప్పను దర్శించుకొని బయటకు వస్తున్న వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. మహిళలు ఆలయంలోకి అడుగుపెట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. 
 
కేరళ రాష్ట్రం కోయిలుండిలో అయ్యప్పను దర్శించుకున్న మహిళ బిందు ఇంటి వద్ద ఆందోళనలు మొదలయ్యాయి. పరిస్థితిని ముందుగానే పసిగట్టిన బిందు భర్త హరిహరణ్.. కుమార్తెతో కలిసి పరారయ్యారు. ఇంటికి తాళం వేసి ఎక్కడికో పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments