నవంబరులో వివాహం జరగాల్సింది.. ఇంతలోనే రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు కోల్పోయాడు.. (video)

సెల్వి
మంగళవారం, 14 అక్టోబరు 2025 (10:29 IST)
Bike
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ వుంటాయి. ఆదివారం గ్రేటర్ నోయిడాకు చెందిన తుషార్ అనే యువకుడు బైక్‌పై.. దాద్రి రైల్వే ట్రాక్‌ వద్దకు వచ్చాడు. అయితే రైలు రావడానికి ఇంకా కొంత సమయం ఉండడంతో బైక్‌పైనే ట్రాక్‌ను దాటడానికి  ప్రయత్నించాడు. 
 
అయితే అదే సమయంలో అనుకోకుండా బైక్‌ అదుపు తప్పింది. దీంతో బైక్‌తో పాటు రైలు పట్టాలపై పడిపోయాడు. వెంటనే తేరుకొని బైక్‌ను తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే.. రైలు దగ్గరకు వచ్చింది. దాన్ని గ్రహించి పక్కకు పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. 
 
అప్పటికే సమీపానికి వచ్చిన రైలు తుషార్‌ను ఢీకొట్టడంతో తుషార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ట్రాక్‌ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
 
మృతుడిని దాద్రిలోని దత్తావాలి గ్రామానికి చెందిన తుషార్ (19) గా గుర్తించారు. అతను ఇటీవలే 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంకా ఏ కళాశాలలోనూ అడ్మిషన్ తీసుకోలేదు. తుషార్ వివాహం నవంబర్ 22న జరగాల్సి ఉందని, ఇంట్లో సన్నాహాలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ విషాదంతో కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖుష్బూ సుందర్ పెద్ద కుమార్తె వివాహానికి హాజరు కాని విజయ్.. త్రిష మాత్రం?

అనుష్క, ప్రభాస్, రానా ముగ్గరూ కలిసి బాహుబలి 3 వుంటుందని అనేశారు, వీడియో

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

తర్వాతి కథనం
Show comments