కట్టుకున్న భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. భర్తను గోడకేసి కొట్టి.. ఆపై గొంతు నులిమి హత్య చేసిందో మహిళ. ఆపై ప్రమాదవశాత్తూ చనిపోయాడని పోలీసులతో సహా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం భావత్‌తండాకు చెందిన సభావత్ కిషన్ నాయక్(40), శిరీష దంపతులు వనస్థలిపురంలో నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శిరీషకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది.
ఈ సంబంధం పట్ల భార్యాభర్తల పట్ల జగడం వచ్చింది. సోమవారం సాయంత్రం మద్యం తాగిన కిషన్ నాయక్ తన భార్య పనిచేసే వద్దకు వెళ్లి ఇంటికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో మరోసారి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో శిరీష భర్త కిషన్ నాయక్‌గా గట్టిగా గోడకేసి కొట్టింది.
అంతటితో ఆగకుండా ఆయన గొంతును గట్టిగా నులిమి హత్య చేసింది. ఆపై అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లింది. కిషన్ నాయక్‌కు పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిపారు.