Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 1100 రైళ్లు రద్దు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 5 మే 2022 (11:28 IST)
దేశ వ్యాప్తంగా దాదాపు 1100 రైళ్లను భారతీయ రైల్వే శాఖ రద్దుచేసింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం క్రమక్రమంగా పెరుగుతుంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా, నేలబొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. దీనికితోడు వేసవి ఎండల తీవ్రత నానాటికీ పెరిగిపోతోంది. దీంతో కరెంట్ డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. బొగ్గు ఉత్పత్తిలో కొరత ఏర్పడంతో విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా సాగడం లేదు. దీంతో ఇండియన్ రైల్వే ఈ సంక్షోభంపై దృష్టిసారించింది. 
 
విద్యుత్ కేంద్రాలకు త్వరితగతిన బొగ్గును తరలించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం గూడ్సు రైళ్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, భారీగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 1100 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. 
 
ఇప్పటికే అనేక రైళ్లు ఉన్నాయి. వీటిలో 500 ట్రిప్పుల ఎక్స్‌ప్రెస్ మెయిల్ రైళ్లు, 580 ట్రిప్పుల ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఏప్రిల్ 29వ తేదీన బొగ్గు రైళ్ళను నడిపేందుకు వీలుగా ఏకంగా 240 ప్యాసింజర్ ట్రైన్స్‌ను రైల్వే శాఖ రద్దుచేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం