Webdunia - Bharat's app for daily news and videos

Install App

రయీస్ ప్రమోషన్: రైలులో సన్నీలియోన్.. రెచ్చిపోయిన ఫ్యాన్స్.. కిటికీపై కొడుతూ.. చప్పుడు చేస్తూ?

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన షారూఖ్ ఖాన్ మూవీ రయీస్ ప్రమోషన్లో భాగంగా సెంట్రల్ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే అగస్ట్ క్రాంతి ఎక్స్ ప్రెస్‌లో షారుఖ్, సన్నీలతో పాటు చిత్ర యూనిట్ బయలుదేరారు. రైలు ఎక్కే సమయంల

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (11:00 IST)
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన షారూఖ్ ఖాన్ మూవీ రయీస్ ప్రమోషన్లో భాగంగా సెంట్రల్ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే అగస్ట్ క్రాంతి ఎక్స్ ప్రెస్‌లో షారుఖ్, సన్నీలతో పాటు చిత్ర యూనిట్ బయలుదేరారు. రైలు ఎక్కే సమయంలో సన్నీ లియోన్ బుర్కా ధరించి ఎక్కింది. ఇంజిన్ మార్పిడి కోసం గుజరాత్‌లోని వడోదరలో రైలును కాసేపు ఆపారు. అప్పటికే పలు మాధ్యమాల ద్వారా వీరంతా రైలులో వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, భారీ సంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్నారు. 
 
రైలులో ఉన్న బాలీవుడ్ శృంగార నటి సన్నీలియోన్‌ను చూసి ఆమె ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమె కూర్చున్న బోగీని వందలాది మంది చుట్టుముట్టారు. కిటికీపై కొడుతూ, చప్పుడు చేశారు. అభిమానుల తొక్కిసలాటను చూసిన సన్నీ నిశ్చేష్టురాలైంది. ఆ తర్వాత విండో కర్టెన్ మూసేసింది. అయినా సరే ఆగని అభిమానులు కిటికీని కొడుతూనే ఉన్నారు. గుజరాత్‌‍లోని వడోదర స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. షారుఖ్ ఖాన్ ది కూడా ఇదే పరిస్థితి. చివరకు, పోలీసులు రంగ్ర ప్రవేశం చేసి, లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో వడోదర స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments