Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యేళ్ల కిందట కంగువ చేసిన ప్రామిస్ ఏంటి ?

డీవీ
సోమవారం, 11 నవంబరు 2024 (10:06 IST)
Kanguva- surya
వెయ్యి సంవత్సరాల క్రితం కంగువ అనే జాతి నాయకుడు చేసిన ప్రామిస్ కూ ఇప్పటి తరానికి లింక్ చేస్తూ చేసిన ప్రయోగమే కంగువ. సూర్య రెండు పాత్రలు పోషించారు. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.  ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు 'కంగువ' రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు.
 
'కంగువ' రిలీజ్  ట్రైలర్ ఎలా ఉందో చూస్తే...వెయ్యిళ్ల కిందట ఐదు తెగల మధ్య సాగే పోరాటం నేపథ్యంగా, ఓటమి ఎరుగని ధీరుడైన నాయకుడు కంగువను ఒకవైపు, ప్రస్తుత కాలంలోని స్టైలిష్ హీరోను మరోవైపు చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. వెయ్యేళ్ల కిందట కంగువ చేసిన ప్రామిస్ ఏంటి, ఆ మాటను ఈనాటి కథానాయకుడు ఎలా నిలబెట్టాడు అనేది ఆసక్తికరంగా చూపిస్తూ ట్రైలర్ సాగింది. ఒక వీరుడి ప్రతిజ్ఞ ఏంటి ?, అతన్ని మోసం చేసిందెవరు ?, ఆ వీరుడు పునర్జన్మ ఎత్తాడా ?, అతను నిలబెట్టిన గౌరవం ఎలాంటిది ? అనే అంశాలతో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. వెయ్యేళ్ల కిందటి కంగువ ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేశారో, అంతే అల్ట్రా మోడరన్ గా నేటి కథనాయకుడి ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఈ రెండు పాత్రల్లో సూర్య నట విశ్వరూపం కనిపించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 'ధీర ధీర కదన విహార..ధీర.' పాట బీజీఎం "కంగువ" ట్రైలర్ ఇంటెన్సిటీ పెంచింది. "కంగువ" సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేలా ఈ రిలీజ్ ట్రైలర్ ఉండి ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న తితిదే పాలక మండలి భేటీ.. ఆడంబరాలకు దూరంగా చైర్మన్!!

ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలే.. ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్

నెల్లూరు దగదర్తిలోనే ఎయిర్ పోర్టు.. సిద్ధమవుతున్న డీపీఆర్‌లు

భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లకు బిగిస్తే కఠిన చర్యలు : వైజాగ్ కమిషనర్

మీ మధ్యలో ఓ మహిళా జర్నలిస్టు నలిగిపోతుంటే.. గమనించారా? జర్నలిస్టులకు పవన్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments