నాగచైతన్య యేట గురి తప్పి పాకిస్తాన్ లో బందీగా మారిన తండేల్

డీవీ
శనివారం, 6 జనవరి 2024 (12:38 IST)
Tandel - Naga Chaitanya
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. తెలుగు, తమిళంలోనూ రూపొందుతోంది. మత్స్యకారుల జీవితంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు చందు మొంటేటి తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి సముద్రంలోని యేటకు వెళ్ళిన నాగచైన్య సీన్స్ తీశారు. ఆ తర్వాత ఏమి జరిగిందనేది చిన్న గ్లింప్స్ ను నేడు విడుదుల చేశారు.
 
Tandel - Naga Chaitanya
జడ్డా.. గుర్తెట్టుకో.. ఈపాలి యేట..గురి తప్పేదెలేదేస్...ఇక రాజులమ్మ జాతరే .. అంటూ పలికే డైలాగ్ తర్వాత సముద్రం నీటిలో వలవిసురుతాడు. కట్ చేస్తే, పాకిస్తాన్ బోర్డర్ దాటడంతో అక్కడి పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. మూడురంగుల జెండాను చూడగానే ఆఫీసర్.. ఏంట్రా, దేశ భక్తా. అది కూడా మీ దేశాకికే.. అంటూ వెటకారంగా అంటాడు. దాంతో చైతు.. మానుంచి వీడిపోయిన ఓముక్క.. ఆ ముక్కను ముష్టేసిన మాకెంత్తుండాలి.. తేరే పాకిస్తన్ అడ్డా మే పేట్ కే బతారహా హూ.. భారత్ మాతా కీ జై.. బుగ్గు లేపి తొండకొట్టేస్తా.. అంటూ ఆవేశంగాపలుకుతాడు. ఆ తర్వాత  బుజ్జి తల్లి వచ్చేస్తున్నా గదే.. అంటూ సాయిపల్లవి షాట్ కనబడతుంది.
 
ఆసక్తిగా సాగిన తండేల్ గ్లింప్స్ రెండు దేశాల మధ్య జరిగే పోరాటంగా కనిపిస్తుంది. గతంలో మత్సకారులు సముద్రంలో పొరపాటున బోర్డర్ దాటితే వారిని ఖైదీలుగా భావించి చిత్ర హింసలు పెట్టేవారు. కొందరిని చంపేసేవారు. ఈ నేపథ్యంలో రాబోతున్న తండేల్ నాగచైతన్య కెరీర్ కు మంచి మార్క్ వుంటుందని నిర్మాత అల్లు అరవింద్ తెలియజేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments