నా సామిరంగ చిత్రంలో నాగార్జున పారితోషికంపై హాట్ టాపిక్

డీవీ
శనివారం, 6 జనవరి 2024 (11:59 IST)
Nagarjuna look
ముందు హిట్ లేకపోయినా రెమ్యునరేషన్ విషయంలో తగ్గెదేలే అన్నట్లు అక్కినేని నాగార్జున వున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఎన్నో హిట్స్ ఇచ్చిన ఆయన ఇటీవల ప్రయోగాత్మక సినిమాలు చేసినా పెద్దగా ఆడలేదు. మరలా తన సంక్రాంతి ఫార్ములాతో నా సామిరంగ అంటూ ఈసారైన హిట్ కొట్టాలని కసితో వున్నారు. ఇందులో రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కూడా వుండడంతో పూర్తి వినోదభరిత సినిమాగా వుండబోతోందని దర్శకుడు విజయ్ బిన్ని మాటలు బట్టి తెలుస్తోంది.
 
కాగా, ఇంతకుముందు సంక్రాతి హీరోగా వున్న నాగార్జున ఈసారి కూడా ప్రణాళిక ప్రకారం సంక్రాతికే వస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. అయితే గత రెండు చిత్రాలకు 6 నుంచి 8 కోట్ల రూపాయలు తీసుకున్న ఆయన ప్రస్తుతం ఈ సినిమాకు నాగార్జున దాదాపు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కాగా, ఇప్సిపటికే నాన్ థ్రియేట్రిక్ రైట్స్ 32 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. మరోవైపు నైజాం రైట్స్ కూడా నాగార్జున తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదలకుముందే ఈ సినిమా నిర్మాతకు బాగా బిజినెస్ అయిందని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments