Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభితా ధూళిపాళ, రాజీవ్ సిద్ధార్థ్ ఫిల్మ్ లవ్, సితార

డీవీ
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (17:16 IST)
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ, రాజీవ్ సిద్ధార్థ్ ఫిల్మ్ లవ్, సితారలో కీలక పాత్రల్లో సోనాలి కులకర్ణి, జయశ్రీ, వర్జీనియా రోడ్రిగ్జ్, సంజయ్ భూటియాని, తమరా డిసౌజా, రిజుల్ రాయ్ తదితరులు నటించారు. RSVP నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కాబోతుంది. 
 
నేడు ఈ మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. అనేక భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ ఫ్యామిలీ డ్రామా తెర‌కెక్కింది. ఓ కుటుంబంలోని స‌భ్యుల మ‌ధ్య ఉండే వివిధ ర‌కాలైన స‌మ‌స్య‌ల‌ను, ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేసే సినిమా ఇదని ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. రోనీ స్క్రూవాలా RSVP మూవీస్ నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. 
 
ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే... ప్ర‌కృతి అందాల‌తో ఆక‌ట్టుకునే కేరళ పచ్చటి అందాల న‌డుము తెర‌కెక్కిన క‌థే ల‌వ్ సితార‌. తార‌ (శోభితా ధూళిపాళ) ఓ స్వతంత్ర్య భావాలున్న ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌. అంత‌ర్జాతీయంగా మంచి పేరున్న చెఫ్ అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ)తో ప్రేమ‌లో పడుతుంది. వారిద్ద‌రూ పెళ్లికి ముందు తార ఇంటికి వెళ‌తారు. అక్క‌డ పెళ్లి జ‌రగ‌టానికి ముందు కుటుంబాల్లోని విబేదాలు, తెలియ‌కుండా దాగిన నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. చివ‌ర‌కు ఈ జంట ప్ర‌యాణం ఎటువైపు సాగింద‌నేదే సినిమా.  సోనాలి కులకర్ణి, బి.జయశ్రీ, రోడ్రిగ్స్, సంజయ్ భూటియాని, తమరా డిసౌజా, రిజుల్ రే  త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.
 
శోభితా దూళిపాల‌ మాట్లాడుతూ,‘‘సితారలో నటిచడం  చక్కటి అనుభూతినిచ్చింది. నేను పోషించిన పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయి. వైవిధ్య‌మైన పాత్ర‌. స్వ‌తంత్య్ర భావాలున్న ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ పాత్ర‌లో న‌టించాను. నిజాయ‌తీగా ఉండే ఓ అమ్మాయి త‌న జీవితంలో ఎదురైన స‌వాళ్ల‌ను ధైర్యంగా ఎలా ఎదుర్కొంద‌నేదే క‌థ‌. చ‌క్క‌టి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి”అని అన్నారు.
 
రాజీవ్ సిద్ధార్థ స్పందిస్తూ,‘‘లవ్, సితార’ ట్రైలర్ అందరినీ ఆక‌ట్టుకోవ‌టం చాలా సంతోషంగా ఉంది. అందులో అర్జున్ అనే పాత్ర‌లో న‌టించాను. నేను ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకునే క్ర‌మంలో ఎలాంటి మ‌లుపు తీసుకుంది. నా చుట్టు ఉన్న పాత్ర‌ల్లో ఉన్న సంక్లిష్ట‌త వాస్త‌విక‌త‌ను ఎంత ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌నేది ఆసక్తిని రేపే విష‌యం. శోభిత‌గారితో క‌లిసి న‌టించటం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. జీ 5 ప్రేక్ష‌కుల‌ను ఈ ఒరిజ‌ల్ ఫిల్మ్ మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉందిరియు 'లవ్, సితార' ప్రతి ZEE5 వీక్షకుడికి నచ్చుతుందని నేను నమ్ముతున్నాను”అని అన్నారు.
 
డైరెక్ట‌ర్  వందన కటారియా మాట్లాడుతూ “ ల‌వ్ సితార‌’ అనేది ప్రేక్ష‌కుల‌కు ఓ ఆహ్లాద‌కరమైన ప్రయాణం. చ‌క్క‌టి ఫ్యామిలీ డ్రామా. RSVPతో కలిసి పని చేయ‌టం, అలాగే ఈ ప్రయాణంలో  ZEE5 నుంచి దొరికిన మ‌ద్ధ‌తు చూసి థ్రిల్ ఫీల్ అవుతున్నాను. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ప్రేమ‌, కుటుంబంలో వ్య‌క్తుల మ‌ధ్య ఉండే భావోద్వేగాల‌ను ఇందులో చ‌క్క‌గా చూపించాం’’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య కుమార్తె (video)

ఆడ‌పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్.. జాగ్ర‌త్త‌!!

పవన్ అంటే గుర్తొచ్చేవి సేవ, సాయం.. అదే జగన్ అంటే గుర్తొచ్చేవి ఏవంటే..?

గణేష్ నిమజ్జనం ట్యాంక్ బండ్‌లో కుదరదు, ఎందుకంటే?

ఉత్తరప్రదేశ్.. సమోసాలో కప్ప కాలు.. షాకైన కస్టమర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?

నాణ్యతకు భరోసా: బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు

డెంగ్యూ జ్వరంతో రక్తంలో పడిపోయిన ప్లేట్‌లెట్లు పెంచుకునే మార్గం ఇదే

తర్వాతి కథనం
Show comments