Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్ షిప్, వావ్ అనిపించే యాక్షన్ సన్నివేశాలతో సలార్ సీజ్ ఫైర్!

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (17:10 IST)
Prbhas latest
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. అన్‌కాంప్ర‌మైజ్డ్ బ‌డ్జెట్‌తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో సినిమాల‌ను నిర్మిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది. మోస్ట్ అవెయిటెడ్ మూవీగా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఎప్పుడెప్పుడు సినిమా వ‌స్తుందా అనేంత రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచిన ఈ సినిమా డిసెంబ‌ర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఆకాశాన్నంటింది. సోమవారం మేకర్స్ ఈ మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
 
ట్రైలర్‌ను గమనిస్తే.. ఇద్దరు పిల్లల మధ్య స్నేహం.. వారి పెరిగి పెద్దయిన తర్వాత కాన్సార్ ప్రాంతానికి రాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) కావాలనుకున్న వాడిపై శత్రువులు దాడి చేస్తే తన స్నేహితుడి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసే మరో స్నేహితుడు దేవా (ప్రభాస్) కథే సలార్ సీజ్ ఫైర్ అని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న అంచనాలు రిలీజ్ ట్రైలర్‌తో మరింత పీక్స్‌కి చేరుకున్నాయి.
 
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ట్రైలర్, టీజర్, సూరీడే సాంగ్‌లకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ని రాబట్టుకున్నాయి. స‌లార్ సీజ్ ఫైర్ కేవ‌లం యాక్ష‌న్ సినిమాయే కాదు..అంత‌కు మించి ఎమోష‌న‌ల్ కంటెంట్ ఉంటుంద‌ని ఆడియెన్స్‌కి క్లియ‌ర్‌గా తెలుస్తోంది.
 
డిసెంబ‌ర్ 22న హోంబలే సంస్థ ఇప్పుడు ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. క్రిస్మస్ సీజన్‌లో సలార్ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments