పృథ్వీరాజ్ భారతదేశపు ఉత్తమ దర్శకుల్లో ఒకరు అవుతారు : మోహ‌న్ లాల్

డీవీ
మంగళవారం, 28 జనవరి 2025 (17:28 IST)
Prithviraj Sukumaran, Mohan Lal and others
మోహ‌న్ లాల్ టైటిల్ పాత్ర‌లో న‌టించి 2019లో విడుద‌లై  బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన చిత్రం ‘లూసిఫ‌ర్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2ఇ ఎంపురాన్’ రూపొందుతోంది. మ‌ల‌యాళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌  నిర్మిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. లూసిఫ‌ర్‌, బ్రో డాడీ చిత్రాల తర్వాత మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూడో సినిమా ఇది. ఆదివారం నాడు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను కోచిలో నిర్వహించారు.
 
దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. మా సోదరుడు, మా నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ మొదటి నుంచీ ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇస్తూనే వచ్చారు. ఈ ప్రాజెక్ట్ ప్రయాణంలో ప్రతీ క్షణం ఆయన నాతోనే ఉన్నారు. మోహన్ లాల్ లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఈ ప్రయాణంలో ఆయన నాకెంతో సపోర్ట్ ఇచ్చారు. వాతావరణ పరిస్థితుల కారణంగా మోహన్ లాల్ గారిని ఓ వారం మొత్తం ఖాళీగా కూర్చోబెట్టాను. అప్పుడు ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నారు. సినిమా నిర్మాణం పైనే దృష్టి పెట్టమని చెప్పారు’ అని అన్నారు.
 
మోహన్ లాల్ మాట్లాడుతూ.. పృథ్వీరాజ్ యాక్సిడెంటల్ డైరెక్టర్ అని ఆయన అన్నారు. కానీ అది సరి కాదు. పృథ్వీరాజ్ భారతదేశపు ఉత్తమ దర్శకుల్లో ఒకరు అవుతారని నేను ఆశిస్తున్నాను. ఎంపురాన్‌ షూటింగ్ టైంలో మేము చాలా సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మూవీని నేను ఆల్రెడీ చూశాను. దర్శకుడిగా పృథ్వీరాజ్ తన 100 పర్సెంట్ ఇచ్చారు. ఎంపురాన్ మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం మలయాళ సినిమాకు ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుంద’ ని అన్నారు.

మంజు వారియర్ మాట్లాడుతూ.. ‘ఆశీర్వాద్ సినిమాస్‌ బ్యానర్లో ఎన్ని చిత్రాలు చేశానో కూడా నాకు గుర్తులేదు. లూసిఫర్‌లో నా పాత్ర కెరీర్ బెస్ట్‌గా నిలిచింది. ఈ సీక్వెల్‌ని కూడా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ప్రియదర్శిని రాందాస్ పాత్రను పోషించిన మంజు వారియర్ మాట్లాడుతూ.. ‘ఆశీర్వాద్ సినిమాస్‌ బ్యానర్లో ఎన్ని చిత్రాలు చేశానో కూడా నాకు గుర్తులేదు. లూసిఫర్‌లో నా పాత్ర కెరీర్ బెస్ట్‌గా నిలిచింది. ఈ సీక్వెల్‌ని కూడా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
టోవినో థామస్ మాట్లాడుతూ..‘నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుందని పృథ్వీరాజ్ నాతో చెప్పారు. ఆర్టిస్ట్‌గా జతిన్ రాందాస్ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎంపురాన్‌పై భారీ అంచాలు ఉన్నాయి. లలెట్టాన్‌తో స్క్రీన్‌ను పంచుకునే అవకాశం రావడం ఎంతో అదృష్టం. ఈ ప్రయాణంలో ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments