Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లోకి వచ్చారు... మీరు ఏం చేయడానికైనా రెడీనా..? క్యాస్టింగ్ కౌచ్‌పై ఫాతిమా

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (17:15 IST)
సినిమాల్లోకి అడుగుపెట్టారు.. మీరు ఏం చేయడానికైనా సిద్ధమా అని క్యాస్టింగ్ కౌచ్‌పై ఫాతిమా సనా షేక్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, సౌత్ మూవీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడుకోవడం సర్వసాధారణమని ఆమె చెప్పుకొచ్చారు. 
 
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' మూవీతో తెరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్... ఆ తర్వాత కూడా మంచి చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. అయితే, తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఫాతిమా షాకింగ్ కామెంట్స్ చేశారు.
 
'నా కెరీర్ తొలినాళ్లలో ఒక సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్లాను. అక్కడ మీరు ఏం చేయడానికైనా రెడీనా..? అంటూ ఓ దర్శకుడు నన్ను అడిగాడు. కష్టపడి పనిచేస్తానని.. నా పాత్ర కోసం ఏం కావాలో అది చేస్తానని అతనితో చెప్పా. కానీ, అతను మాత్రం అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగాడు. నాకు అతని ఉద్దేశమేంటో నాకు అర్థమైంది. కానీ, అతడు ఎంతకు దిగజారుతాడో చూద్దామని తెలియనట్లే ప్రవర్తించాను' అని ఫాతిమా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరించారు.
 
అలాగే, హైదరాబాద్ నగరంలో ఓ నిర్మాతను కలిసిన సమయంలో అనుభవాన్ని పంచుకుంటూ.. "నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడుతారు. మీకు తెలుసా.. ఇక్కడ మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది అనేవాళ్లు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్లుకాదు. ఎలా చెప్పినా వారి ఉద్దేశమైతే అదే అని తెలిసిపోయేది" అని ఫాతిమా తెలిపారు. దీంతో ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani Family in Visakhapatnam: విశాఖలో పాకిస్థానీ ఫ్యామిలీ.. అలా పర్మిషన్ ఇచ్చారు..

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

YS Sharmila: గృహ నిర్భంధంలో షర్మిల - పోలీసులకు నన్ను ఆపే హక్కు లేదు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments