Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమాగా పెద కాపు-1

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (16:40 IST)
Virat Karna
విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ విడుదల తేదీ సమీపిస్తోంది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉండటంతో మ్యూజిక్ ప్రమోషన్‌లు చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమైయ్యాయి, టీజర్ మంచి అంచనాలను నెలకొల్పింది. ఇప్పుడు, మేకర్స్ ఈ చిత్రం ట్రైలర్ డేడ్ కి సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. ట్రైలర్ సెప్టెంబర్ 11న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ వీడియోలో  సినిమాలోని కోర్ పాయింట్‌ను తెలియజేసేలా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ వీడియోను విడుదల చేశారు.
 
పెద కాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా అని టీజర్ ద్వారా తెలుస్తోంది. ట్రైలర్‌లో సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియనున్నాయి.
 
ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ఇండియన్ లీడింగ్ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రాఫర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments