Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారిక కొణిదెల ఆవిష్కరించిన నరుడి బ్రతుకు నటన ట్రైలర్

డీవీ
గురువారం, 10 అక్టోబరు 2024 (21:41 IST)
Narudi Bratuku natana
శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నరుడి బ్రతుకు నటన అనే చిత్రం రాబోతోంది. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతోన్న ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవరించారు. సుధీర్ కుమార్ ప్రాజెక్ట్ హెడ్. ఈ సినిమా థియెట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు.
 
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసి.. యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ ట్రైలర్.. శివ కుమార్ నటుడు అవ్వాలని ఆడిషన్స్ ఇస్తూ ఫెయిల్ అయ్యే సీన్ తో ఓపెన్ అవుతోంది. అందరూ అతడ్ని నిరుత్సాహ పరుస్తూనే ఉంటారు. జీవితం అంటే ఏంటో తెలిస్తేనే.. నటన తెలుస్తుందని చెప్పడంతో.. ఓ తెలియని ఊరికి వెళ్తాడు. అలా కథ హైద్రాబాద్ నుంచి కేరళకు షిఫ్ట్ అవుతుంది. ట్రైలర్ లో చూపించిన కేరళ అందాలు, సినిమాలోని ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. హాస్యం, ప్రేమ, ఎమోషన్ ఇలా అన్ని రకాల అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తీశారని ట్రైలర్ చెబుతోంది.
 
శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్ తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ప్రత్యేకమైన స్క్రిప్ట్‌ని ఎంచుకున్న రిషికేశ్వర్ యోగి దానిని ఆకర్షణీయంగా మలిచారనిపిస్తోంది. డైలాగ్స్ ఎమోషనల్‌గా ఉన్నాయి. ఫహద్ అబ్దుల్ మజీద్ కేరళలోని ప్రకృతి దృశ్యాలను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. NYX లోపెజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్‌ను మరింతగా పెంచేసింది. అక్టోబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాకి ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
 
తారాగణం: శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వివా రాఘవ్, దయానంద్ రెడ్డి, తదితరులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సముద్రపు తాబేలు కూర తిని ముగ్గురి మృతి, 30 మందికి పైగా అస్వస్థత

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. స్టెల్లా షిప్‌ను సీజ్‌ చేసిన అధికారులు

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్‌పై తప్పుడు నివేదిక : డాక్టర్ ప్రభావతి అరెస్టు తప్పదా?

పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా : ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments