Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లవ్ స్టోరీ" నుంచి 'ఏవో ఏవో కలలే'... మహేష్ చేతుల మీదుగా రిలీజ్ (Video)

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (18:47 IST)
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం "లవ్‌స్టోరీ". ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే 'సారంగదరియా' అనే పాటను రిలీజ్ చేయగా అది సంచలనాలు సృష్టిస్తోంది. పైగా, ఓ వివాదం కూడా చెలరేగింది. ఇది టీ కప్పులో తుఫానులా సమసిపోయింది. 
 
ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాట రిలీజైంది. 'ఏవో ఏవో కలలే' అనే గీతాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. 'ఏవో ఏవో కలలే' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని మహేశ్ బాబు పేర్కొన్నారు. 
 
నిర్మాత నారాయణ దాస్ నారంగ్‌తో పాటు యావత్ చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. 'ఏవో ఏవో కలలే' గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. పవన్ సీహెచ్ సంగీత దర్శకుడు. సున్నితమైన ప్రేమకథా చిత్రంగా వస్తున్న 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజైన 'సారంగ దరియా' గీతం విశేషరీతిలో ప్రజాదరణ పొందింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments