Webdunia - Bharat's app for daily news and videos

Install App

సున్నితమైన ప్రేమ కథతో శేఖర్ కమ్ముల లవ్‌స్టోరీ (ట్రైలర్ రిలీజ్)

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (12:03 IST)
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం ఉదయం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సున్నితమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 
 
ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు బాగున్నాయి. బిజినెస్ చేయాలనుకునే ఆలోచనలో చైతూ పడ్డ కష్టాలను చూపించారు. మిడిల్ క్లాస్ వాళ్ళ ఇబ్బందులు సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నట్టు కనిపిస్తోంది.
 
ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి డ్యాన్సర్‌గా కనిపించబోతుంది. ట్రైలర్‌లో చైతూ, సాయి పల్లవి మధ్య డైలాగులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 
 
ముఖ్యంగా, ట్రైలర్‌లో ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లొకేషన్స్ ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఫిదా త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల నుండి వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. వినాయ‌క చ‌వితికి విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. సెప్టెంబర్‌ 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.
 
ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల చేసిన ‘లవ్‌స్టోరీ’ టీజర్‌, ‘సారంగ దరియా’ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సారంగద‌రియా పాట అయితే అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. ఇక తాజాగా చిత్ర ట్రైలర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. సున్నితమైన ప్రేమ కథతో శేఖర్ కమ్ముల మరోసారి హృదయాన్ని తాకేలా సినిమాని తెర‌కెక్కించినట్టు ట్రైల‌ర్ చూస్తే అర్థమ‌వుతుంది.
 
ఈ సినిమాలో రావు రమేశ్, దేవయాని, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు. ప‌వ‌న్ సీహెచ్ సంగీతం అందించారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. నారాయణ దాస్, కే నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments