Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

డీవీ
శుక్రవారం, 5 జులై 2024 (19:37 IST)
powrusham team
షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా "పౌరుషం - ది మ్యాన్‌హుడ్".  UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రం కోసం  ప్రతిభావంతులైన, ప్రఖ్యాత నటీనటులు పని చేస్తున్నారు. ఈ సినిమా సౌండ్‌ట్రాక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో డాక్టర్ ఒలంపియా ఏ.జెలినీ, హాలీవుడ్ హీరోయిన్, సింగర్ ల్యూబా పామ్, అంబర్ మార్టినేజ్, సాగే, హాలీవుడ్ లక్స్ ఏంజెల్స్ స్టూడియోస్ కో- ప్రొడ్యూసర్ లెన్నీ విటుల్లి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.   
 
"పౌరుషం - ది మ్యాన్‌హుడ్" ట్రైలర్‌ను చూస్తుంటే.. ఉమ్మడి కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లు, పాత సంప్రదాయాలను ప్రశ్నించేలా ఉంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ ఉంటాయని ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు మేకర్స్. నేటి సమాజాన్ని ఆకర్షించే సన్నివేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. 
 
నటీనటులు : సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, ఆమని, గీత రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, , జబర్దస్త్ హీనా, జబర్దస్త్ కట్టప్ప, బాల గంగాధర్, వైజాగ్ షరీఫ్, లక్ష్మి, రవి వర్మ తదితరులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments