Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధాన్ని ఆవిష్క‌రించే విమానం జూన్ వస్తోంది (video)

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (11:09 IST)
Samudra Khani, Master Dhruvan
జీవితంలో ఏదో సాధించాల‌ని మ‌న‌కు చెప్పే పాత్ర‌ల‌ను వెండితెర‌పై చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి పాత్రల‌తో రూపొందిన చిత్ర‌మే ‘విమానం’. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఆడియెన్స్‌ను అల‌రించ‌నుందీ సినిమా. వైవిధ్య‌మైన పరిస్థితులు, వాటికి సరిపోయేటువంటి సున్నిత‌మైన పాత్ర‌ల‌ను ఈ చిత్రంలో మ‌నం చూడొచ్చు.
 
విమానం సినిమాలో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ స‌ముద్ర ఖని అంగ వైక‌ల్యంతో బాధ‌ప‌డే మ‌ధ్య వ‌య‌స్కుడిగా, భార్య లేక‌పోయినా పిల్లాడిని  జాగ్ర‌త్త‌గా చూసుకునే వీర‌య్య అనే తండ్రి పాత్ర‌లో న‌టించారు.  జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్ సినిమా రూపొందుతోంది. శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
 
విమానం ప్రోమోను మేక‌ర్స్ శుక్ర‌వారం విడుద‌ల చేశారు. ప్రోమోను గ‌మ‌నిస్తే.. అందులో తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధం క‌నిపిస్తుంది. రాజు అనే అనే అబ్బాయి త‌న తండ్రి పాత్ర‌లోని స‌ముద్ర ఖ‌నితో మాట్లాడుతూ.. ఓసారైనా త‌న‌ని విమానం ఎక్కించ‌మ‌ని అడుగుతుంటాడు. విమానం ఎక్కటానికి ఎందుకంత ఇష్టం నీకు అని అడిగితే పై నుంచి చూస్తే అన్నీ చిన్న‌గా క‌నిపిస్తాయ‌ని అంటాడు. అయితే బాగా చ‌దువుకుంటే పెద్ద‌య్యాక నువ్వే విమానం ఎక్కొచ్చ‌ని తండ్రి అంటాడు. ఇందులో సున్నితంగా, చ‌క్క‌గా తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉన్న భావోద్వేగాల‌ను ప్రోమోలో చ‌క్క‌గా ఎలివేట్ చేశారు రైట‌ర్, డైరెక్ట‌ర్ శివ ప్ర‌సాద్ యానాల‌
 
ఈ సందర్భంగా జీ స్టూడియోస్‌ సౌత్ మూవీస్ హెడ్ అక్ష‌య్ క్రేజీవాల్ మాట్లాడుతూ ‘‘కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్‌తో అసోసియేట్ కావ‌టం చాలా సంతోషంగా ఉంది. మా కాంబోలో మంచి న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ టీమ్‌గా ఏర్పడి భావోద్వేగాల క‌ల‌బోత‌గా బ‌ల‌మైన క‌థాంశంతో రూపొందిన విమానం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. ప్రేక్ష‌కులు న‌చ్చే, మెచ్చే కంటెంట్‌ను అందించ‌ట‌మే మా ల‌క్ష్యం. ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నాం’’ అన్నారు.
 
స‌ముద్ర ఖ‌ని, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌తో పాటు ఇందులో మీరా జాస్మిన్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి చ‌ర‌ణ్ అర్జున్ సంగీతాన్ని అందించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా జూన్ 9 గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Green anacondas: వామ్మో.. కోల్‌కతాలోని అలీపూర్ జూకు రెండు ఆకుపచ్చ అనకొండలు

Khazana Jewellery: ఖ‌జానా జ్యువెల‌రీలో దోపిడీ.. ఎంత ఎత్తుకెళ్లారంటే..? (video)

ఆస్తి కోసం కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...

జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్- వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్.. ఇవి ఎన్నికలా? సిగ్గుగా వుందంటూ జగన్ ఫైర్ (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో వర్షాలే వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

తర్వాతి కథనం
Show comments