Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాంటి పాట ఒక్కటి కూడా లేదని అసూయ పడ్డాః న‌ల్ల‌మ‌ల టీజ‌ర్ లో దేవ్‌క‌ట్టా

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:13 IST)
Devkatta, amith, Bhnusri etc
బానిస బ‌తుల నుంచి బ‌య‌ట‌ప‌డి నల్లమల అడవుల్లో స్వేచ్చా వాయువును పీల్చుకుంటున్న సమయంలో మానవమృగం రాక‌తో ఎటువంటి ప‌రిణామాలు సంభ‌వించాయ‌నే పాయింట్‌తో `న‌ల్ల‌మ‌ల్ల‌` చిత్రం రూపొందుతోంది. అమిత్‌ తివారీ, భానుశ్రీ జంట‌గా న‌టిస్తున్నారు. రవి చరణ్ ‌ద‌ర్శ‌కుడు. ఆర్‌.ఎమ్ నిర్మాత. ఈ చిత్రంలో సిద్ద్ శ్రీ‌రామ్ ఆల‌పించిన జాన‌ప‌ద గీతం `ఏమున్న‌వే పిల్లా` పాట‌కు మిలియ‌న్స్ కి పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆ పాట‌కు ల‌క్ష‌కు పైగా క‌వ‌ర్‌సాంగ్స్ రావ‌డం విశేషం.
 
ఈ సంద‌ర్భంగా చిత్రంలోని ఆ పాట‌ను, ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ను గురువారంనాడు రామానాయుడు స్టూడియోలో ఆవిష్క‌రించారు. టీజర్‌ను ప్రముఖ దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు. ఆ పాట‌కు అనుగుణంగా అమిత్‌, భానుశ్రీ స్టేజీపై స్టెప్‌లు వేయ‌డం మ‌రింత ఆక‌ట్టుకుంది.
 
అనంత‌రం దేవాకట్టా మాట్లాడుతూ, ఏమున్నావే - పిల్ల‌ పాటను నేను నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్‌లో ఉంటే వింటాను. ఇలాంటి పాట నాకు ఒక్కటి కూడా లేదని అసూయ పడ్డాను. ఈ ఆడిటోరియంలోనే ఎంతో లైఫ్ ఉంది. ఇది అందరినీ బ్లెస్ చేస్తుంది. నా సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందే ఈ ఆడిటోరియంకు తీసుకొచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. ఆ పోస్టర్‌ను చూసి ఒక్కసారిగా ఆగిపోయాను. అమిత్‌ను మొదటిసారి చూసినప్పుడే అన్నాను. ఇంత మంచి యాక్టర్‌వి ఎందుకు అంత తక్కువగా కనిపిస్తున్నావ్ అని అన్నాను. మంచి ఫుడ్ చాలా అరుదుగా దొరుకుతుందన్నట్టుగా అనిపించింది. అజయ్ ఘోష్‌ను `ప్రస్థానం` సినిమాతోనే ప‌రిచ‌యం చేశాను. ఆ తరువాత `ఆటోనగర్ సూర్య`లో కూడా ఉన్నారు. ఆ చిత్రంలో విలన్‌కు వాయిస్ ఇచ్చారు. ఈ సినిమాలో పెద్ద క్యాస్టింగ్ వుంది. సక్సెస్‌కు మొదటి మెట్టు పడ్డట్టు అయింది. టీంను చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నేను మిమ్మల్నీ ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. మీ పాజిటివిటీనే నేను తీసుకోవాలనేట్టు ఉంది. ఈ సినిమా వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను అని అన్నారు.
 
సంగీత ద‌ర్శ‌కుడు పీఆర్ మాట్లాడుతూ, మా టీజర్‌ను విడుదల చేసినందుకు దేవా కట్టా గారిని థ్యాంక్స్. మీ సినిమాల గురించి దర్శకుడు చెబుతుంటారు. మీరు వచ్చినందుకు థ్యాంక్స్. ఈ సినిమాలోని సాంగ్ ఫస్ట్ టైం డైరెక్టర్ విన్నారు. ఆ తరువాత నేను విన్నాను. అప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ఏం సాధించలేరు అని అన్న వారికి ఆ సాంగ్‌తో సమాధానం చెప్పినట్టు అయింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి జీవితాంతం రుణ పడి ఉంటాను’ అని అన్నారు.
 
కొరియోగ్రాఫ‌ర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అవకాశం ఇచ్చిన దర్శకుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
రోమాలు నిక్కబొడుచుకున్నాయి
న‌టుడు అమిత్ మాట్లాడుతూ, దేవాకట్టా టీజర్ విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు అన్నీ మా దర్శకుడు రవి చరణ్ గారే. ఆయన ఎంత కష్టపడ్డారో కళ్లారా చూశాను. నన్ను ఈ సినిమాలో హీరోగా పెట్టుకున్నందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మొదటిసారి ఈ కథ విన్నప్పుడే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నాకు ఏ విలన్ కారెక్టర్ ఇస్తారో, ఏ కారెక్టర్ ఇస్తారో అని అనుకున్నాను. నా మైండ్‌లో అలానే ఉంది. ఇందులో నా పాత్ర ఏంటి అని అడిగాను. హీరో మీరే అని అన్నారు. ఆ మాటతో నేను షాక్ అయ్యాను. నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు అంటే నమ్మలేకపోయాను. కానీ ఈ సినిమాకు నేను హీరో కాదు, కథే ఈ చిత్రానికి హీరో. కథ ఎంతో అందంగా ఉంటుంది. వాటి గురించి దర్శకుడు చెబితేనే బాగుంటుంది. సంగీత ద‌ర్శ‌కుడు పీఆర్ అందించిన పాట ఎన్నో మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసేసింది. భాను గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. నల్లమల అద్భుతమైన స్టోరీ. మీ అందరికీ నచ్చుతుంది. టీజర్ చాలా బాగుంది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం మాపై ఉంటుందని నమ్ముతున్నాను ` అన్నారు.
 
హీరోయిన్ భాను శ్రీ‌ మాట్లాడుతూ, నాకు పల్లెటూరి పిల్లలా ఉండటం చాలా ఇష్టం. ఇలాంటి పాత్ర నాకు వస్తుందని ఊహించలేదు. నాకు ఈ కారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది నాకు పెద్ద అవకాశం. నల్లమల సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన పాట చాలా పెద్ద హిట్ అయింది. ఎక్కడికి వెళ్లినా ఆ పాటతోనే నన్ను గుర్తిస్తున్నారు. మా టీజర్‌ను విడుదల చేసినందుకు దేవా కట్టా గారికి థ్యాంక్స్. అమిత్ గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు మంచి స్నేహితుడు. కెమెరామెన్ మేకప్ వేసుకున్నా కూడా వద్దు అంటూ సహజంగా అందంగా చూపించారు. పాటల వల్లే నల్లమల అనే చిత్రం ఉందని తెలిసింది. థియేటర్లో చూడాలని అనుకున్నాను. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది అన్నారు.
 
ద‌ర్శ‌కుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ‘నాతో ఈ సినిమా చేసినందుకు, నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడేలా చేసిన నిర్మాత ఆర్ఎమ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు దేవా కట్టా గారంటే చాలా ఇష్టం. టీజర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. సినిమా గురించి రెండు విషయాలు చెబుతాను. అడవిని అడవి తల్లి.. గోవును గోమాత అని అంటాం. బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్చా వాయువును పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ఎంట్రీ అయింది. ఆ మృగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే  ఈ కథ. తరువాత సినిమా గురించి చాలా విషయాలు చెబుతాను. ఈ సినిమా కోసం పని  చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Clarity on Retirement Age ఉద్యోగుల పదవీ విరమణ వయసులో మార్పు లేదు : కేంద్రం

Tirupati Girl Reels At Alipiri మోడ్రన్ దుస్తుల్లో కిస్సిక్ పాటకు రీల్.. సారీ చెప్పిన యువతి

YS Sharmila Sensational Comments జగన్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు.. చంద్రబాబుకు డబ్బులు అందాయా?

భూకంపం: ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆ రెండు జిల్లాలు తప్ప మిగతా ప్రాంతమంతా సేఫ్ జోన్‌లోనే’

ఎగిరే చేపలు.. తిమింగలం, గరుడ పక్షి నుంచి తప్పించుకుని.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

తర్వాతి కథనం
Show comments