Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

దేవి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (19:27 IST)
Shabadam - Adi Pinishetti
‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ రోజు మేకర్స్ ‘శబ్దం’ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ‘వెయ్యి గబ్బిలాలు చెవిలో అరుస్తున్నట్లు వుంటుంది డాక్టర్’ అనే వాయిస్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం  థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ఎలిమెంట్స్ తో కట్టిపడేసింది.
 
ట్రైలర్ ఆడియో హాలోజినేషన్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని ఇచ్చింది. మేకర్స్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ని చాలా డిఫరెంట్ ప్రజెంట్ చేశారు.  ట్రైలర్ సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది.
 
ఆది పినిశెట్టి పారానార్మల్ ఇన్వెస్టి గేటర్ క్యారెక్టర్ లో తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. లక్ష్మీ మీనన్ క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.
 
అరుణ్ బత్మనాభన్ అందించిన విజువల్స్ సినిమాలో లీనమయ్యేలా చేశాయి. ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ ని మరింతగా పెంచుతుంది. జాతీయ అవార్డు గ్రహీత సాబు జోసెఫ్ ఎడిటింగ్ షార్ఫ్ గా వుంది. మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
 
‘శబ్దం’ ఫిబ్రవరి 28న ఆంధ్రాలో ఎన్ సినిమాస్, నైజాంలో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. టెర్రిఫిక్ ప్రిమైజ్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, హంటింగ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
 
నటీనటులు: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

గుంటూరు మిర్చి యార్డ్ విజిట్: ఏపీ సర్కారు రైతులకు "శాపం"గా మారింది.. జగన్ (video)

పూణేలో జీబీఎస్ పదో కేసు.. 21 ఏళ్ల యువతి కిరణ్ చికిత్స పొందుతూ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments