8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

దేవీ
శనివారం, 7 జూన్ 2025 (17:45 IST)
Ananthika Sunilkumar
ఫస్ట్ టీజర్‌తో ఒక సంచలనం సృష్టించిన తర్వాత' 8 వసంతాలు' చిత్ర నిర్మాతలు ఇప్పుడు సెకండ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ మంచి ఎమోషనల్ ఎక్స్ పీరియన్స్ అందించింది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై. రవిశంకర్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సనీల్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించారు.
 
టీజర్ విజువల్ గా కవితాత్మక సన్నివేశంతో ప్రారంభమవుతుంది. వర్షంలో తడిసిన అనంతిక, ఊటీకి వచ్చిన కొత్త తెలుగు రచయిత సంజయ్‌ను  గమనిస్తుంది. “అతను పదాలని ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పువ్వుల్లా వుంటాయి. అదే కసితో రాస్తే పిన్ తీసిన గ్రెనేడ్‌ లా ఉంటాయి'అనే వాయిస్ సంజయ్ పాత్రని అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
 
"అమ్మాయిలకి కత్తి పట్టుకుని రౌద్ర రసం చూపేవాడు కంటే..  కన్నీళ్లు తుడుస్తూ కరుణ రసం చూపించేవాడు అంటేనే ఇష్టం" అనే డైలాగ్ యూనివర్సల్ గా కనెక్ట్ అవుతోంది. "ప్రేమ చేరుకోవడానికి ఒక గమ్యం కాదు, మనం చేయాల్సిన ప్రయాణం" అనే హార్ట్ టచ్చింగ్ లైన్ తో టీజర్ ముగుస్తుంది. ఇది సినిమా ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది.
 
విజువల్ గా, ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా వుంది. విశ్వనాథ్ రెడ్డి అద్భుతమైన సినిమాటోగ్రఫీ, హేషమ్ అబ్దుల్ వహాబ్ మనసుని కదిలించే స్కోర్‌తో ఫణీంద్ర నర్సెట్టి అద్భుతమైన సంభాషణలు ప్రాణం పోసుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఫస్ట్ క్లాస్.
 
అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైన్ సినిమా లీనమయ్యే అనుభూతిని పంచాయి. శశాంక్ మాలి ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అనంతిక సనిల్‌కుమార్ అద్భుతంగా కనిపించారు. తన పెర్ఫార్మెన్స్ హార్ట్ టచ్చింగ్ గా వుంది.
 
అద్భుతమైన కథనంతో, 8 వసంతాలు ఈ మాన్సూన్ లో పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments