Webdunia - Bharat's app for daily news and videos

Install App

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

దేవీ
శనివారం, 7 జూన్ 2025 (17:27 IST)
Kishore Teja, Satvika, Ramana, Divi
మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో కిషోర్ తేజా, సాత్విక లీడ్ రోల్స్‌లో నటించిన మై లవ్ ఆల్బమ్ సాంగ్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. వాకాడ అప్పారావు నిర్మించిన ఈ ఆల్బమ్  భావోద్వేగంతో కూడిన సంగీతం, రిఫ్రెషింగ్ విజువల్స్‌తో  ఈ సాంగ్ కి సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించగా, క్రాంతి ఆచార్య మనసుని కదిలించే సంగీతాన్ని అందించారు.

కపిల్ కపిలన్ అద్భుతంగా ఆలపించిన ఈ పాట మ్యూజికల్ లవర్స్ ని మెస్మరైజ్ చేసింది. కిషోర్ తేజా, సాత్విక కెమిస్ట్రీ లవ్లీగా వుంది. రామ్ రెడ్డి పన్నాలా కాన్సెప్ట్, డైరెక్షన్ హార్ట్ టచ్చింగ్ గా వుంది. జయపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ విజువల్స్‌ ట్రీట్ ని అందించాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ గా వైరల్ అయ్యింది.  
 
హీరో కిషోర్ తేజ మాట్లాడుతూ, ఈ పాట తెలుగు తమిళ్ హిందీ మూడు భాషల్లో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. క్రాంతి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాట చూసి ఎలా ఉందో ఆడియన్స్ డిసైడ్ చేయాలి. మా నిర్మాత వాకాడ అప్పారావు చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తోనే సాంగ్ ఇంత అద్భుతంగా వచ్చింది. చాలా మంచి సాంగ్ ఇది. ఆడియన్స్ అందరూ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను'అన్నారు.  
 
యాక్టర్ రమణ మాట్లాడుతూ,  ఇది సాంగ్ లాగా లేదు. ఒక సినిమా లాగా ఉంది. కథంతా ఈ సాంగ్ లో చూపించారు. మ్యూజిక్ కెమెరా ఎడిటింగ్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. పాటని హిట్ చేసి టీమ్ అందర్నీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను'అన్నారు
 
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మదర్ గీత మాట్లాడుతూ,  పాట చాలా మెలోడీస్ గా ఉంది. అద్భుతమైన ఎమోషన్ ఉంది. సాత్విక కిషోర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పాట వినండి. వింటూనే ఉంటారు'అన్నారు.
 
దివి మాట్లాడుతూ, లవ్ ఈజ్ వెరీ పెయిన్, అలాంటి ప్రేమ మీద ఇలాంటి మంచి సాంగ్ చేశారు. కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సాత్విక తేజ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. తప్పకుండా అందరూ సాంగ్ వినండి'అన్నారు.
 
సాత్విక మాట్లాడుతూ,  స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం ఫస్ట్ టైం. మా టీకి థాంక్యూ. ఈ సాంగ్ తీసినప్పుడు ఎంత స్పెషల్ గా అనిపించిందో చూసినప్పుడు మీకు అంతే స్పెషల్గా అనిపించిందని అనుకుంటున్నాను.
 
డైరెక్టర్ రామ్ రెడ్డి మాట్లాడుతూ, మంచి కంటెంట్ తో తీస్తే ఆడియన్స్ ఎప్పుడు కూడా మంచి వ్యూస్ ఇస్తారు. ఈ సాంగ్ కి కూడా మాకు సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మా నిర్మాత వాకాడ అప్పారావు చాలా సపోర్ట్ చేశారు. మా హీరో కిషోర్ తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. తను ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments