ఏజెంట్‌ తోనూ అఖిల్‌ సక్సెస్‌ కొట్టలేకపోవడానికి కారణాలు ఏమిటి?

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (15:10 IST)
Akhil 6pack
అఖిల్‌ అక్కినేని నటించిన ఇంతకుముందు సినిమాలేవీ పెద్దగా ఆయనకు విజయాన్ని ఇవ్వలేకపోయాయి. అందుకే పూర్తి యాక్షన్‌ సినిమా తీయాలని చేసిన ఏజెంట్‌ నేడు విడుదలైనా హైదరాబాద్‌లో మార్నింగ్‌ షో ప్లాప్‌ టాక్‌ రావడంతో మ్యాట్నీనుంచి కలెక్షన్లు పడిపోయాయని తెలుస్తోంది. హాలీవుడ్‌లో రేంజ్‌లో సినిమా తీశామని విడుదలకు ముందు దర్శక నిర్మాతలు, హీరో చెబుతున్నవి ఒట్టిమాటలే అని తేలింది. సామాన్యప్రేక్షకుడికి పెద్దగా ఆకట్టుకోలేకపోవడానికి వక్కంతం వంశీ కథలో లోపమే. ఆయన కథ ఇచ్చినా ఏ సినిమా పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ఆయినా ఇండస్ట్రీలో ఆయన చెబుతున్న కథకు అందరూ ఫిదా అయిపోతుంటారు. 
 
అసలు ఏజెంట్‌ సినిమా ప్లాప్‌ కావడానికి కారణాలు చాలానే వున్నాయి. మొదటగా రా ఏజెంట్‌ అనగానే నాగార్జున, కమల్‌హాసన్‌, బాలకృష్ణ వంటివారు, గతంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ వంటివారు చేసిన సినిమాలూ వున్నాయి. ప్రస్తుతం రా ఏజెంట్‌ అంటే టెర్రరిస్టులనుంచి దేశాన్ని కాపాడడమే అంశంగా వుంటుంది. ఇదే విషయాన్ని విడుదలకు ముందు నిర్మాత అనిల్‌ సుంకర, హీరో అఖిల్‌ ను అడిడితే, అదేమీలేదు. టెర్రరిజానికి సంబంధమేలేదు. అంతకుమించిన పాయింట్‌ వుందని వెల్లడించారు. కానీ సినిమా చూశాక ముక్కు చుట్టూరా తిరిగి చూపించినట్లుగా వుంది.
 
పోనీ.. కీలకమైన పాయింట్‌ గా ఇండియా వంటి దేశాన్ని శాసిస్తుంది. రాజకీయనాయకులను గైడ్‌ చేస్తుంది. దేశంలో చట్టాలు కూడా తమకు అనుకూలంగా వుండేలా చేసేది కార్పొరేట్‌ శక్తులే. ఎవరు అధికారంలో వుండాలి అనేది శాసించేది ఆ సిండికేట్సే. అందుకే వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ దేశంలో ఒకొక్కక్కరు టాప్‌ రేంజ్‌లో వుంటున్నారు. ఇప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ జరుగుతున్న తంతే. వేల కోట్ల రూపాయలను అవినీతి చేసి దేశం వదిలిపారిపోయిన శక్తులను కేంద్రమే ఏమీ చేయలేక చేతులెత్తేసింది. ఇది జరుగుతున్న కథ. ఈ కథను లైట్‌గా టచ్‌ చేసి షడెన్‌గా టెర్రిజం వైపు వెళ్ళాడు. ఇక అక్కడ నుంచి సాగే కథ చాలా సినిమాల్లో చూసిందే. నాగార్జున వైల్‌డాగ్‌ సినిమా కూడా అంతే.
 
దర్శకుడు సురేందర్‌ రెడ్డి కరోనా సోకి షూటింగ్‌ కు వీల్‌చైర్‌లో వచ్చి చేశాడని తెలిసింది. భారీ తారాగణం, నిర్మాణపు విలువలు వున్న ఈ సినిమాలో సీరియస్‌ అంశంతో కేంద్రమంత్రి ఇంటికి వెళ్ళి వార్నింగ్‌ ఇచ్చిన హీరో కథ బలే మలుపు తిరిగింది అనుకున్న టైంలో వెంటనే హీరోయిన్‌తో డ్యూయెంట్‌ సాంగ్‌. ఇలా రెండు సందర్భాల్లో రావడంతో రొటీన్‌ పాతచింతకాయ పచ్చడిగా మార్చేశారు.
 
రా చీఫ్‌ మమ్ముటి పాత్రలోనూ సీరియస్‌ నెస్‌లేదు. పై అధికారుల మాటలు వినకుండా తనకు నచ్చిందే చేసుకుంటూపోతాడు. ఇంత పవర్‌ ఎలా వచ్చింది అనే దానిలో క్లారిటీలేదు. ఇప్పటి జనరేషన్‌కు తగినట్లుగా వుండాలనే హ్యాకర్‌ అనే పాత్రను హీరోకు పెట్టారు. విలన్‌ తన టీమ్‌తోనూ, రా చీఫ్‌ మమ్ముట్టి తన టీమ్‌తోపాటు దేశంలో ఎక్కడ ఏమి జరిగినా మోనిటర్‌లో అన్నీ తెలిసిపోతుంటాయి అనేలా చూపించినా అది వర్కవుట్‌కాలేదనే చెప్పాలి.
 
హీరో పాత్ర కొతిలా బిహేవ్‌ చేస్తుందని అఖిల్‌ చెప్పినా, కనీసం జాకీజాన్‌లా నవ్విస్తూ ఏజెంట్‌గా తన పనులు తాను చేసుకుంటాడనిపించింది. కొంచెం ఆ షేడ్స్‌ వున్నాయని విడుదలకు ముందు నిర్మాత చెప్పినా తీరా చూశాక పొంతనేలేదు.
 
హీరో ఆహార్యానికి మించిన స్థాయిలో కండలు చూపించి ఆర్నాల్డ్‌ స్కావెంజర్‌లా యాక్షన్‌ సినిమా చేయాలనుకోవడం తప్పిదమే. లవర్‌బాయ్‌ ఇమేజ్‌ వున్న ఆయనతో ఇలాంటి సినిమా చేయడమూ సాహసమే. తన ఆలోచనలు వేరేగా వుంటాయి. మీ తరం వేరు. మా తరం వేరు అని సినిమా ఆరంభంలో అఖిల్‌ తన తండ్రి మురళీశర్మకు చెబుతాడు. ఏమిటా ఆలోచనలు వేరుగా ఉండడం. బతకడానికి ఏదైనా పనికివచ్చేవేనా? అంటూ ఎదురు ప్రశ్నిస్తాడు. నేను చేసి చూపిస్తా అంటూ అఖిల్‌ అంటాడు. అందుకే ఏజెంట్‌ చేసి చూపించినట్లుగా వుంది. 
వందల కోట్లు పెట్టి తీసిన నిర్మాతను అభినందించాల్సిందే. దీనివల్ల కొన్ని వందల మందికి షూటింగ్‌ సమయంలో పని కల్పించినందుకు అభినందించాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments