Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేదికపై భార్యను టీజ్ చేసిన ఏ.ఆర్.రెహ్మాన్... ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (14:40 IST)
AR Rehman
ప్రముఖ సంగీతదర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ తన సతీమణి సైరా బానును టీజ్ చేశారు. అనేక మంది సమక్షంలో ఆయన అలా నడుచుకోవండతో ప్రతి ఒక్కరూ విస్తుపోయారు. అయితే, ఇది నిజమైన టీజ్ కాదండో... వేదికపై తన భార్యను ఆటపట్టించేందుకు రెహ్మాన్ అలా వ్యాఖ్యానించారు.
 
ఇటీవల చెన్నైలో ఓ వారపత్రిక ఆధ్వర్యంలో సినీ రంగానికి అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును రెహ్మాన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన తన భార్య సైరా బానుతో కలిసి హాజరయ్యారు. అవార్డును స్వీకరించిన తర్వాత రెహ్మాన్ మాట్లాడుతూ, 'సాధారణంగా నా ఇంటర్వ్యూలను మళ్లీ చూడను. కానీ ఈమె మాత్రం పదేపదే చూస్తుంటారు. తనకు నా వాయిస్ అంటే చాలా ఇష్టం' అని అన్నారు. 
 
ఆ తర్వాత తన భార్యను వేదికపైకి పిలించారు. అపుడు ఆమెను మాట్లాడాల్సిందిగా వ్యాఖ్యాత కోరారు. దీంతో ఆమె మైక్ అందుకుని మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా, రెహ్మాన్ జోక్యం చేసుకుని "హిందీలో వద్దు.. తమిళంలో మాట్లాడు.. ప్లీజ్" అంటూ కోరాడు. దీనికి సైరా బాను ఓ మై గాడ్ అంటూ రియాక్షన్ ఇచ్చారు. 
 
ఆమె చాలా తెలివిగా హిందీ, తమిళంలో కాకుండా మధ్యేమార్గంగా ఇంగ్లీషులో మాట్లాడారు. "క్షమించాలి. నాకు తమిళం స్పష్టంగా రాదు అందుకే ఇంగ్లీషులో మాట్లాడుతాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రెహ్మాన్ వాయిస్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ వాయిస్‌తోనే నేను ప్రేమలో పడిపోయారు. ఇంతకన్నా ఏం చెప్పగలను" అని అన్నారు. కాగా,1995లో సైరా బానును వివాహం చేసుకున్న రెహ్మాన్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments