Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రంగస్థలం' టాక్ ఎలావుందంటే?... చిట్టిబాబు - రంగమ్మత్తకు లింకేంటి?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ కె. సుకుమార్ తెరకెక్కించిన చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో నిర్మితమైన ఈ చిత్రం ప్రీమియర్ షో

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (08:53 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ కె. సుకుమార్ తెరకెక్కించిన చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో నిర్మితమైన ఈ చిత్రం ప్రీమియర్ షోలు యూఎస్, లండన్‌లలో ముగిశాయి. సినిమా చూసిన వాళ్లు పాజిటివ్ వ్యాఖ్యలను చేస్తున్నారు. చిత్ర హీరో చెర్రీ చిట్టిబాబు పాత్రలో అదరగొట్టేశాడనీ కితాబిస్తున్నారు. సమంత మంచి నటనకు మంచి మార్కులు వేస్తున్నారు.
 
ముఖ్యంగా, చిట్టిబాబు, రంగమ్మత్త మధ్య సాగే సన్నివేశాలు సూపర్బ్‌గా ఉన్నాయంటూ చెపుతున్నారు. కథ పాతదే అయినప్పటికీ, సుకుమార్ తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని అంటున్నారు. తొలి సగభాగం బాగుందని, ఇంటర్వెల్ ట్విస్ట్ సూపరని, ఆపై సినిమాను కొద్దిగా లాగినట్టు కనిపించినా, 'జిగేల్ రాణి' పాత్ర, ఆపై ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయంటూ ఈ చిత్రం చూసిన వారు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. 
 
ఇకపోతే, ఈ చిత్రానికి సంగీతం ప్రాణంగా ఉందట. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా ఉందని చెబుతున్నారు. మొత్తం మీద సినిమాకు సూపర్ హిట్ ఖాయమని చెపుతున్నారు. అయితే, సినిమా నిడివి చాలా అధికంగా ఉండటం మైనస్ పాయింట్‌గా పేర్కొంటున్నారు. ఈ చిత్రంలో చిట్టిబాబు అన్నగా ఆది పినిశెట్టి నటించగా, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, అనసూయ తదితరులు నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోజూ కాసులిస్తేనే పక్కలోకి రండి - భార్య షరతు.. పోలీసులకు టెక్కీ ఫిర్యాదు

పుడమికి చేరిన సునీతా విలియమ్స్... ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి?

హమాస్‌తో సంబంధాలు.. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

Marri Rajasekhar: వైకాపాకు మరో ఎదురుదెబ్బ- ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా (video)

Vishnupriya: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు యాంకర్ విష్ణుప్రియ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments