Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది అస్సలు కరెక్ట్ కాదు... నటి మాధవీలత

సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పైన రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది అస్సలు కరెక్ట్ కాదంటూ నటి మాధవీ లత విమర్శించారు. ఆమె మాటల్లోనే... " కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో లేదని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పడం నాన్సెన్స్. హాలీవుడ్ ఇండస్ట్రీలోనే వు

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (22:08 IST)
సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పైన రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది అస్సలు కరెక్ట్ కాదంటూ నటి మాధవీ లత విమర్శించారు. ఆమె మాటల్లోనే... " కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో లేదని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పడం నాన్సెన్స్. హాలీవుడ్ ఇండస్ట్రీలోనే వుంది. అంత ఫ్రీడం వున్నచోట కూడా మీ టూ కాంపెయిన్ జరిగింది. అన్నిచోట్ల వుందని ఒప్పుకోవాలి.
 
స్టార్ హీరోయిన్లు సపోర్ట్ చెయ్యరంతే. రకుల్ అలా చెప్పకుండా ఉండాల్సింది. స్మార్ట్‌గా తప్పించుకుని తిరగాలని చెప్పాల్సింది. ఐటీ, ప్రభుత్వం, డాక్టర్... ఒకటేంటి అన్నిచోట్లా లైంగిక వేధింపులున్నాయి. జనాల్ని పిచ్చోళ్లను చెయ్యొద్దు రకుల్. దర్శకనిర్మాతలు మంచివారే తారసపడటం అదృష్టమని చెప్పొచ్చు. మంచు లక్ష్మి అక్క అంటే నాకు చాలా ఇష్టం.
 
ప్రతి ఆఫీసులో లైంగిక వేధింపులు జరుగుతూనే వుంటాయి. కెరీర్ లాస్ అవుతుందని పెద్ద హీరోయిన్లకు భయం. రకుల్ ప్రీత్ సింగ్‌కు జరక్కుండా వుంటుందా. కంగనా, దీపికా పదుకునేకే జరిగినప్పుడు మీకు జరుగదని చెప్పడం కరెక్ట్ కాదు. టాలీవుడ్ అంతా ఏమీ నాశనమైపోలేదు. తెల్లని దుస్తులే వేసుకున్నారు.. అంతా దేవతలే అని చెప్పడం కరెక్టు కాదు.
 
పక్కనున్నవాళ్లు నాశనమైపోతుంటే ఎవరికివాళ్లు పట్టనట్లు వుండటం కరెక్టు కాదు. ఒకట్రెండు సందర్భాల్లో ఎదుర్కొన్నాను. ధైర్యంగా ముందుకు వచ్చి కొంతమంది చెప్తున్నందుకు ధన్యవాదాలు. మీకెందుకు మాధవీలత అని అనుకోవచ్చు కానీ నేను అలా గమ్మునుండను. ఇది చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను అంటూ చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం