Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా 'పవర్' చూపించిన 'ధృవ'... రివ్యూ రిపోర్ట్

రామ్‌ చరణ్‌, దర్శకుడు సురేందర్‌ రెడ్డి కాంబినేషన్లో తమిళ రీమేక్‌ వస్తుందనగానే ఏదో ప్రత్యేకత వుందని అభిమానుల్లో నెలకొంది. 2015లో జయం రవి, తమన్నా, అరవింద్‌ స్వామి కాంబినేషన్‌లో వచ్చిన 'తనీ ఒరువన్‌' చిత్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (14:18 IST)
ధృవ నటీనటులు : రామ్‌ చరణ్‌, అరవింద్‌ స్వామి, నవదీప్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, పోసాని కృష్ణమురళీ, నాజర్‌, మధు, షిండే తదితరులు; సంగీతం : హిపాప్‌ తమిజా, నిర్మాత : అల్లు అరవింద్‌, ఎన్‌.వీ.ప్రసాద్‌, దర్శకత్వం : సురేందర్‌ రెడ్డి.
 
రామ్‌ చరణ్‌, దర్శకుడు సురేందర్‌ రెడ్డి కాంబినేషన్లో తమిళ రీమేక్‌ వస్తుందనగానే ఏదో ప్రత్యేకత వుందని అభిమానుల్లో నెలకొంది. 2015లో జయం రవి, తమన్నా, అరవింద్‌ స్వామి కాంబినేషన్‌లో వచ్చిన 'తనీ ఒరువన్‌' చిత్రమది. దాన్ని 'ధృవ' పేరుతో తెలుగులో అల్లు అరవింద్‌, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మించగా... తన కథతో సినిమా చేయడానికి వచ్చిన సురేందర్‌ రెడ్డిని రామ్‌ చరణ్‌ రీమేక్‌ చేసేలా చేశాడు. అయితే చిత్రం ముగిశాక.. ఇకపై రీమేక్‌లు చేయడం నావల్ల కాదనేంతగా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఈ శుక్రవారమే విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ :
ధృవ (రామ్‌ చరణ్‌), నవదీప్‌ మరో ముగ్గురు పోలీసు ఆఫీసర్స్‌ ఉద్యోగాల కోసం శిక్షణలో వున్నవారు. శిక్షణలో వుండగానే రాత్రుళ్లు ఎవరికీ తెలీకుండా సిటీలో జరిగే నేరాలను అడ్డుకుంటారు. సమాజం కోసం ఏదో చేస్తున్నామని తృప్తి వారిలో కన్పిస్తుంది. అయితే ఓ గొలుసు దొంగతనం చేయడమే కాకుండా హత్య చేసిన ఓ నేరస్తుడ్ని వీరు పోలీసులకు పట్టిస్తారు. కానీ రెండు రోజుల్లోనే ఓ మంత్రితో అధికార పర్యటనకు వస్తాడు. వీటి వెనకాల పెద్దవారి హస్తముందని.. ప్రతి యాక్షన్‌ వెనుక రియాక్షన్‌ వుందంటూ... అన్ని నేరాలను ఎనలైజ్‌ చూస్తూ ఓ లైబ్రరీని తన రూమ్‌లో పెట్టుకుంటాడు. 
 
చిన్న నేరం వెనుక పెద్ద నేరం వుంటుందనే లాజిక్కుతో తన పరిశోధనలో కొన్ని కనిపెడతాడు. అలా వెతుకుతున్న ధృవకు పద్మశ్రీ అవార్డు గ్రహీత సిద్దార్థ అభిమన్యు(అరవింద స్వామి) అనే సైంటిస్ట్‌ శత్రువుగా కనబడతాడు. అతనికి చెక్‌ పెట్టే క్రమంలో తనే అతని మైండ్‌గేమ్‌లో ఇరుక్కుపోతాడు. తన ప్రతి కదలిక సైంటిస్ట్‌కు ఇట్టే తెలిసిపోతుంది. అదెలా జరుగుతుందని.. ఆలోచిస్తూ ఉండగా.. ఓ నిజం బయటపడుతుంది. అదేమిటి? ఆ తర్వాత తననుకున్న పనిని పూర్తి చేశాడా? లేదా? అన్నది మిగిలిన సినిమా.

బుక్ మై షో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 
సాంకేతిక విభాగం :
తమిళంలో విజయం సాధించిన కథను, పెద్దగా మార్పులేవీ చేయకుండా సురేందర్‌ రెడ్డి చేశాడని చెప్పాడు. కానీ కొన్ని మార్పులు చేయక తప్పలేదు. క్లైమాక్స్‌లోనూ.. సైంటిస్ట్‌ ల్యాబ్‌లోకి చకచకా వెళ్ళిపోవడంలో లాజిక్కు చూపించకుండా మార్చేశాడు. తమిళంలో కాస్త లాజిక్కుగా జయం రవి లోపలికి వెళతాడు. తమిళ వెర్షన్‌ చూసిన వారికి కూడా ఈ సినిమా నచ్చేలా చేయడంలో సురేందర్‌ ప్రతిభ గమనించొచ్చు. ఇక మేకింగ్‌ పరంగా సురేందర్‌ రెడ్డి ఎప్పట్లానే తన బ్రాండ్‌ను మరొకసారి చాటుకున్నారు.  
 
సినిమాటోగ్రాఫర్‌గా పీ.ఎస్‌.వినోద్‌ తన ముద్రను చూపాడు. చక్కటి ఫ్రేమింగ్‌, లైటింగ్‌ వాడుతూ తెలుగు సినిమా స్థాయి పెంచే విజువల్స్‌ అందించాడనే చెప్పాలి. హిపాప్‌ థమిజా అందించిన పాటలు ఫర్వాలేదనేలానే ఉన్నా విజువల్‌‌గా మాత్రం అదిరిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఎడిటింగ్‌ బాగుంది. యాక్షన్‌ కొరియోగ్రఫీని అభినందించకుండా ఉండలేం. ఇక గీతా ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌కు వంక పెట్టడానికి లేదు.
 
విశ్లేషణ:
ఈ సినిమాలోని కథే బలమైంది. అదికూడా తెలిసిన కథే. పరిశోధన పేరుతో సైంటిస్టు పిల్లలపై ప్రయోగాలు చేస్తుంటాడు. ఎందరో చనిపోతుంటారు. దాన్ని కప్పిపుచ్చేందుకు వేరే ఘటనలు జరుగుతాయి. దానికి దీనికి ఇంటర్‌లింక్‌ వుంటుంది. కానీ ఇదంతా కామన్‌మేన్‌కు అర్థంకావు. అలా అర్థమయ్యేది దానిపై దృష్టిపెట్టే పోలీసుకే. ఆ పోలీసుగా ధ్రువ నటించాడు. ఈ కథ చుట్టూ బలంగా అల్లిన స్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. శత్రువును పట్టాలంటే ఆషామాషీ కాదు. మైండ్‌గేమ్‌తో పోరాడాలి. ఆ పోరాటంలో జరిగే సంఘటనలు ఇంట్రెస్ట్‌గా వుంటాయి. 
 
ఆ పాత్ర కోసం కసరత్తు చేసి సిక్స్‌ ప్యాక్‌తో చరణ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుంది. సీరియస్‌ పాత్ర కాబట్టి నటనా పరంగానూ బాగా చేశాడనిపిస్తుంది. పెద్దగా ఎమోషన్‌లు వుండవు. ఒక్కటే ఎమోషన్‌. దాన్ని మెయింటేన్‌ చేస్తూండాలి. సిద్ధార్థ్‌ అభిమన్యుగా నటించిన అరవింద్‌ స్వామి పాత్ర స్టయిలిష్‌గా వుంది. హాలీవుడ్‌ తరహాలో దర్శకుడు పాత్రను తీర్చిదిద్దాడు. నాటితరం క్రేజీ హీరోల్లో ఒకరైన ఆయన, ఇలా ఒక ఇంటరెస్టింగ్‌ రోల్‌తో మళ్ళీ తెలుగు తెరకు పరిచయమవ్వడం అన్నది ఈ సినిమాకు ఫ్రెష్‌ ఫీల్‌ తెచ్చిపెట్టింది. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పాత్ర గత చిత్రాలవలెనే రొటీన్‌గా వుంది. 'పరేషానురా..' పాటలో గ్లామర్‌ షో కనులవిందు చూపించింది. చివరి నీతోనే డ్యాన్స్‌.. ' పాటలో చరణ్‌ స్టెప్పులు బాగానే చేశాడు.
 
హిపాప్‌ తమిజా సమకూర్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కథనాన్ని ఇంట్రెస్ట్‌గా చూపించాయి. సినిమా పరంగా చూసుకుంటే పోలీస్‌ ట్రైనింగ్‌, విలన్‌ పరిచయం, ఇంటర్వెల్‌ ట్విస్ట్‌, కథలోని అసలైన ఎలిమెంట్‌ను చివరివరకూ థ్రిల్లింగ్‌గా నడపడం, తెలుగు సినిమా స్టైల్‌కు భిన్నంగా ఉండే క్లైమాక్స్‌, సిట్యుయేషనల్‌ సాంగ్స్‌, సురేందర్‌ రెడ్డి స్టైలిష్‌ మేకింగ్‌ ఇలా చాలా ప్లస్‌లే ఉన్నాయి ఈ సినిమాలో.
 
అయితే అక్కడక్కడా లాజిక్కు లేని విషయాలు చూపించారు. సెకండాఫ్‌లో సస్పెన్స్‌ను బాగానే అందుకున్నా చాలా చోట్ల సినిమా నెమ్మదిగానే ఉంది. కథ, కథనం మొత్తం బాలీవుడ్‌ నేటివిటీకి తగ్గట్టుగా వుంది. మెడిసిన్‌ మాఫియా, సైంటిస్ట్‌.. రాజకీయ నాయకులు.. ఇలా పెద్ద కథతో వున్న ఈ సినిమా నిడివి రెండున్నర గంటలకు పైనే వుండటంతో ఎక్కువ చూశామనే ఫీలింగ్‌ కల్గుతుంది.
 
మైండ్‌గేమ్‌తో సాగే సినిమా గనుక.. ఫటఫటా సీన్లు వెళ్ళిపోతుంటాయి. హీరో పనులు కూడా అంత స్పీడ్‌గా వుండటంతో లాజిక్స్‌ సరైనవే అయినా సామాన్య ప్రేక్షకులకి అంత త్వరగా అర్థంకావు. టైటిల్‌లో చెప్పినట్లుగా '8' అనే అక్షరంకు పెద్ద లింక్‌ వుంటుందని చెప్పినా.. సినిమాలో 8 సూత్రాలుగా హీరో విలన్‌కు చెప్పడంతో సరిపోతుంది. విలన్‌ చంపాలంటే 8 విషయాలపై దెబ్బకొట్టాలనేది హీరో లాజిక్‌.
 
కాగా 'తనీ ఒరువన్‌' సినిమా హాలీవుడ్‌లో 2013వో వచ్చిన 'ద లోన్‌ ఒన్‌' చిత్రానికి స్పూర్తిగా చెబుతున్నారు. దాన్ని తెలుగులో చేయడం విశేషమే. పోలీసు పాత్ర 'జంజీర్‌'లో చేసినా పెద్ద వుపయోగం లేకపోయినా చరణ్‌కు ఇది కాస్త రిలాక్స్‌ ఇస్తుంది. అయితే భారీ కథతో కూడిన ఈ పాత్రను ఇంకా ఎత్తు వున్న  హీరోకు ఇస్తే సినిమా ఇంకోలా వుండేది. తమిళంలో చేసినంత స్టయిలిష్‌గానూ, పవర్‌గానూ తెలుగులో అరవింద్‌స్వామి పాత్ర లేదని చెప్పవచ్చు. తన ఇంట్రడక్షన్‌ ఎఫెక్టివ్‌గా లేదు. సంభాషణల పరంగా రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్త్రాలున్నాయి. సక్సెస్‌ కోసం తపిస్తున్న రామ్‌ చరణ్‌కు ఈ చిత్రం ఊరటనిస్తుందని చెప్పవచ్చు. క్లాసికల్‌ మూవీ కాబట్టి మాస్‌ ప్రేక్షకుల్ని అలరిస్తే ఈ చిత్రం పెద్ద విజయం సాధించినట్లే.
బుక్ మై షో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 
రేటింగ్ ‌: 3/5
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

Vijayamma: ఆ విషయంలో జగన్-భారతిని నమ్మలేం.. వైఎస్ విజయమ్మ

నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments