Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌రికొత్త‌గా ఇందువ‌ద‌న‌, ప్రేమికులుగా జీవించిన వరుణ్ సందేశ్- ఫర్నాజ్ శెట్టి

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (21:36 IST)
Varun Sandesh, Farnaz Shetty
నటీనటులు: వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘుబాబు, ధన్ రాజ్, ఆలీ, నాగినీడు, సురేఖవాణి, తాగుబోతు రమేష్, మహేష్ విట్టా, పార్వతీశం తదితరులు
సాంకేతిక‌తః సినిమాటోగ్రఫి: బీ మురళీకృష్ణ, కథ, మాట‌లు క‌థ‌నంః సతీష్ ఆకేటి దర్శకత్వం: ఎం శ్రీనివాస రాజు, నిర్మాత: మాధవి అదుర్తి, సంగీతంః శివ కాకాని, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుద‌ల‌- 01-01-2022

 
నూత‌న సంవ‌త్స‌రంలో విడుద‌లైన సినిమా ఇందువ‌ద‌న‌. చాలా కాలం త‌ర్వాత వరుణ్ సందేశ్ న‌టించిన సినిమా ఇది. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర ప‌నిచేసిన ఎం శ్రీనివాస రాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. మొద‌టినుంచి ప్ర‌మోష‌న్‌లో గిరిజ‌న యువ‌తిగా న‌టించిన ఫర్నాజ్ శెట్టి ఫొటోల‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. స‌రికొత్త‌గా అనిపించేలా ప్రేక్ష‌కుడిని రుచి చూపించారు. మ‌రి ఈరోజు విడుద‌లైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

 
క‌థః 
వాసు ( వరుణ్ సందేశ్) ఫారెస్ట్ ఆఫీసర్. తన సిబ్బంది (ధన్‌రాజ్, మహేష్ విట్టా, పార్వతీశం)తో కలిసి అక్రమ కలప స్మగ్లింగ్‌ను ఆడ్డుకొనేందుకు విధుల నిర్వహిస్తుంటారు. ఓ సంద‌ర్భంలో అట‌వీ ప్రాంతానికి వెళుతూ త‌నకు ల‌వ్ స్టోరీ వుంద‌ని వాసు వారికి చెబుతాడు. ఆ అడవిలో గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్ శెట్టి)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆమెకోసం గిరిజ‌న పెద్ద‌ల్ని ఎదిరించి త‌న ఇంటికి తీసుకువ‌స్తాడు.


త‌న‌ను పెంచిన చిన్నాన్న చిన్న‌మ్మ అయిన నాగినీడు, సురేఖ‌వాణి ద‌గ్గ‌ర‌కు తీసుకువ‌స్తాడు. వారు త‌మ కులంకాద‌ని ఇద్ద‌రినీ వెలివేస్తారు. ఆ త‌ర్వాత ప‌రిణామాల‌తో ఆమెను ఇక్క‌డే వ‌దిలేసి డ్యూటీ నిమిత్తం బ‌య‌ట‌కు వెళ‌తాడు. అలా వెళ్ళి తిరిగి త‌న స్నేహితులైన సిబ్బందితో వ‌స్తాడు. ఇక్క‌డికి రాగానే స్నేహితుల‌కు ఇందును చూడ‌గానే భ‌య‌మేస్తుంది. దానికి కార‌ణం ఏమిటి? ఆ త‌ర్వాత క‌థ ఎటువైపు మ‌లుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా.

 
విశ్లేష‌ణః
ఈ క‌థంతా చూస్తే గాఢంగా ప్రేమించుకున్న ప్రేమికుల్ని కొంద‌రు బ‌ల‌వంతంగా చంపేస్తే ఆ త‌ర్వాత వారు ఆత్మ‌లుగా మారితే ఎలా వుంటుంద‌నేది ద‌ర్శ‌కుడు ఎంచుకున్న అంశం. ఈ త‌ర‌హా క‌థ‌ల్లో కొద్దోగొప్పో వ‌చ్చినా దాన్ని సామాన్యుడికి ట్విస్ట్‌ల‌తో చూపిస్తే అది ఎవ‌ర్‌గ్రీన్ స‌బ్జెక్ట్‌. ఆ త‌ర‌హాలోనే ద‌ర్శ‌కుడు చేసిన ప్ర‌య‌త్న‌మిది. ఇందుకు కాస్త హోంవ‌ర్క్ చేస్తే సినిమా మ‌రింత ఆక‌ట్టుకునేది. ఇక ఇందులో న‌టించిన హీరోహీరోయిన్ల పాత్ర‌ల‌ప‌రంగా కొత్త‌గా క‌నిపించారు. వారిద్ద‌రిమ‌ధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. పాత్ర‌ల‌ప‌రంగా లీన‌మై చేసేశారు.
 
 
ఫారెస్ట్ ఆఫీస‌ర్లు సిబ్బందిగా న‌టించిన ధన్‌రాజ్, మహేష్ విట్టా, ప‌ర్వాలేదు. అమాయ‌కత్వంతో కూడిన పాత్ర‌లో పార్వతీశం మెప్పించాడు. మొద‌టి భాగంలో ట్విస్ట్ బాగుంది. ఇందుపై దాడి, ఫారెస్ట్‌లో మాఫియా ఎటాక్ లాంటి అంశాలతో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత వాసు, ఇందు ప్రేమ సన్నివేశాలు సినిమాకు ఫీల్‌గుడ్ అంశాలుగా కనిపిస్తాయి. ఆలీ ఎంట్రీతో వినోదం మరింత ఆకట్టుకొనేలా ఉంటుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషనల్‌గా సాగడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చివర్లో వరుణ్ సందేశ్‌కు సంబంధించిన ట్విస్ట్ సినిమాను మరో మెట్టు ఎక్కిస్తుంది.

 
అయితే వ‌రుణ్‌సందేశ్ త‌న ప్రేయ‌సి ప్రేమ‌కోసం బ‌ల‌వంతంగా కానీ ఆవేశంతోకానీ ప్రేమ‌తోకానీ త‌ను బ‌ల‌వ‌న్మరణం పొంద‌డం స‌రిగ్గా అనిపించ‌లేదు. మ‌రోవైపు ఆత్మ‌లు అనేవి కొంద‌రికే క‌నిపిస్తాయి. అలాంటిది ఈ సినిమాలో అంద‌రికీ క‌నిపించ‌డం కొంత లాజిక్ మిస్ అయింది. దీన్ని హైలైట్ చేస్తే బాగుండేది. ముగింపులో అఘోరా స్వామిని ద‌న్‌రాజ్ క‌ర్ర‌తో కొట్ట‌డం ఆయ‌న మూర్ఛ‌పోవ‌డం బాగున్నా, అలాకాకుండా మ‌రోలా చూపిస్తే బాగుండేది. అస‌లు విల‌న్ ఎవ‌ర‌నేది చివ‌ర‌ల్లో ఇచ్చిన ముగింపు బాగుంది.

 
దర్శకుడు శ్రీనివాస రాజు ఎంచుకొన్న పాయింట్ రెగ్యులర్ అయినప్పటికీ.. ట్రీట్‌మెంట్ బాగుంది. పాత్రలను రాసుకొన్న విధానం, వాటిని తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంది. ఫర్నాజ్ శెట్టిని చూపించిన విధానం ఆకట్టుకొన్నది. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే బెస్ట్ హారర్, థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర ప్రాంతాలను కవర్ చేస్తూ కమెడియన్లతో పాత్రలు రాసుకొన్న తీరు బాగుంది.

 
శివ కాకాని సంగీతం బాగుంది. కీలక సన్నివేశాను రీరికార్డింగ్ బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ బీ మురళీకృష్ణ సన్నివేశాలను తెర మీద అందంగా చూపించాడు. లైటింగ్ వాడుకొన్న విధానం బాగుంది. మిగితా సాంకేతిక నిపుణుల ప్రతిభ బాగుంది. నిర్మాత మాధవి ఆదుర్తి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల ఎంపిక సినిమాపై వారికి ఉన్న అభిరుచిని తెలియజెప్పింది.

 
ఇందులో ప్రేమికులకు బాగా న‌చ్చే సీన్ ఏమంటే. త‌మ ప్రేమ‌ను ముక్కుపై సుతారంగా నిమ‌ర‌డం. హారర్, థ్రిల్లర్, రొమాంటిక్, లవ్ అంశాలు కలబోసి తొలి ప్ర‌య‌త్నం చేసిన ద‌ర్శ‌కుడు కొంచెం లాజిక్‌ల‌తో క‌థ‌ను ర‌న్ చేస్తే మ‌రో లెవ‌ల్లో వుండేది. ప్ర‌స్తుతానికి పెద్ద సినిమాలు లేవు క‌నుక ఈ సినిమాపై మ‌రింత‌గా ప‌బ్లిసిటీ చేసుకుంటే బి,సి. సెంట‌ర్ల్లోని ప్రేక్ష‌కుల‌కు చేరువ‌వుతుంది.
 
రేటింగ్‌- 2.75/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం - శ్రీధర్ బాబు

దశాబ్దం తర్వాత జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

మైనర్ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్!

జడ్జి వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడబోయిన ఎస్ఐ (Video)

20న శ్రీవారి అర్జిత సేవా లక్కీడిప్ టిక్కెట్లు విడుదల!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments