Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ వ్రింద విహారి ట్విట్టర్ రివ్యూ.. ఫుల్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (10:34 IST)
Krishna Vrinda Vihari
యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో హీరో నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి ఈ మూవీని నిర్మించారు. 
 
ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషించారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య, తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర సంగీతం అందిస్తున్నారు.
 
ఇక షిర్లీ సేటియా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. మరి గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ శౌర్యకు ఈ మూవీ ఎంత మేరకు కలిసి వచ్చింది. ఈ సినిమా ఎలా వుందో ట్విట్టర్ వ్యూస్ ద్వారా తెలుసుకుందాం.. 
 
యూఎస్‌లో ప్రీమియర్స్ షోస్ చూసిన సినీ లవర్స్ ఈ సినిమాకు మంచి మార్కులే వేశారు. కృష్ణ వ్రింద విహారి మూవీ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని అంటున్నారు. స్టోరీలో కొత్తేమీ లేకపోయినా.. స్క్రీన్ ప్లే బాగుందని టాక్ వస్తోంది. 
 
ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కథను ములుపు తిప్పుతుందట. నాగశౌర్య ఎప్పటిలాగే కూల్ వైబ్‌తో అట్రాక్ట్ చేశాడు. ఇక హీరోయిన్ షిర్లీ సెటియా తెరపై చాలా అందంగా కనిపించిందని ట్విట్టర్‌లో కామెంట్లు వస్తున్నాయి. 
 
ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ బాగున్నాయని.. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్కట్ అయిందని చెపుతున్నారు. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్ పెద్దగా లేదని మరికొంతమంది చెబుతున్నారు.
 
ప్లస్ పాయింట్స్ 
అనీష్‌ కృష్ణ టేకింగ్‌
మహతి స్వర సాగర్‌ మ్యూజిక్ చాలా బాగుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments