Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాదయాత్రలో చాలా నేర్చుకున్నాను - కంటెంట్ వుంటే పాన్ వరల్డ్‌గా చూస్తారు - నాగశౌర్య

Nagashaurya
, గురువారం, 22 సెప్టెంబరు 2022 (16:45 IST)
Nagashaurya
నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో నాగశౌర్య విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
‘కృష్ణ వ్రింద విహారి' కథ ఎప్పుడు విన్నారు?
‘కృష్ణ వ్రింద విహారి' కథ 2020 కోవిడ్ ఇంకా మొదలవ్వకముందే విన్నాను. కథ వినగానే నచ్చేసింది. వెంటనే సినిమాని చేస్తానని దర్శకుడితో చెప్పా. మంచి ఫన్, ఎంటర్ టైమెంట్, ఫ్యామిలీ, మాస్..ఇలా అందరికీ కావాల్సిన ఎలిమెంట్స్ వున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో రిలేట్ చేసుకుంటారు. ‘కృష్ణ వ్రింద విహారి' ఎవర్ గ్రీన్ కథ. కుటుంబం ఉన్నంతవరకూ ఇలాంటి కథలకు తిరుగులేదు.
 
పాదయాత్ర అనుభవం ఎలా వుంది ? ఆరోగ్యంపై ప్రభావం పడిందా ?
ఆరోగ్యం కొంచెం తేడా కొట్టింది. అయితే అది పాదయాత్ర కంటే సినిమా రిలీజ్ ఒత్తిడి వలన అని భావిస్తాను. నా కెరీర్ లో ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. పాదయాత్రలో ప్రేక్షకుల అభిమానం చూస్తే నిజంగా ఒక వరం అనిపించింది. పాదయాత్రలో చాలా నేర్చుకున్నాను.
 
బ్రాహ్మణ పాత్రలతో అదుర్స్, డిజే, ఇటివల అంటే సుందరానికీ వచ్చాయి కదా.. ఇందులో ఎలా వుండబోతుంది ?
అదుర్స్ , డిజే,  అంటే సుందరానికీ,.. ఇలా ఎన్నో సినిమాల్లో  బ్రాహ్మణ పాత్ర వున్నమాత్రాన పాత్రలు, కథలు ఒకటి కాదు. దేనికదే భిన్నమైనది. ‘కృష్ణ వ్రింద విహారి' కూడా భిన్నమైన కథ.
 
ఇందులో పాత్రల వినోదం  ఎలా వుంటుంది ?
నాతొ పాటు ఇందులో వున్న అందరి పాత్రలో వినోదం వుంటుంది. రాధిక గారి పాత్ర తప్పితే మిగతా పాత్రలన్నీ హిలేరియస్ గా వుంటాయి. అనీష్ మంచి కామెడీ టైమింగ్ వున్న దర్శకుడు. ఇందులో సెకండ్ హాఫ్ నాకు చాలా నచ్చింది. అలాగే రాధిక గారు పాత్ర ఇందులో చాలా కీలకం. రాధిక గారితో నటించడం గొప్ప అనుభవం. రాధిక గారు  బిజీగా వుండి ప్రమోషన్స్ కి రాలేకపోయారు. సక్సెస్ మీట్ కి వస్తారని భావిస్తున్నాను.
 
రొమాంటిక్ కామెడీలని సౌకర్యంగా భావిస్తారా ?
నిజంగా రొమాంటిక్ కామెడీలు చేసినప్పుడు అంత సౌకర్యంగా ఫీలవ్వను. రొమాంటిక్ సీన్స్ లో నేను చాలా వీక్(నవ్వుతూ) నందిని రెడ్డిగారిని అడిగినా ఇదే చెప్తారు. మా దర్శకుడు చాలా కష్టపడి జాగ్రత్తగా ఇందులో చేయించారు.
 
ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ప్రీపేర్ అయ్యారా ?
కమల్ హాసన్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా చాలా పెద్ద స్టార్లు బ్రహ్మణ పాత్రలలో అద్భుతంగా నటించారు. ఈ పాత్ర చేస్తున్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నాకు బాగా తెలిసిన అవసరాల శ్రీనివాస్ బ్రహ్మిన్ కావడం వలన ఆయనకి తెలియకుండానే  ఆయన దగ్గర నుండి కొన్ని చేర్చుకున్నాను.  
 
 షిర్లీ సెటియా హీరోయిన్ గా తీసుకోవడం ఎవరి ఛాయిస్ ?
షిర్లీ సెటియా చేసిన ఒక సినిమాని చూశాం. నచ్చింది. దర్శకుడికి చెప్పాం. ఆయనకి కూడా నచ్చడంతో ప్రాజెక్ట్ లోకి వచ్చింది. చాలా మంచి నటి.
 
మహతి సాగర్ మ్యూజిక్ గురించి ?
సాగర్ తో నాకు స్పెషల్ బాండింగ్ వుంది. నాకు చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడు. ఇందులో మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది.
 
మాస్ సినిమాలు చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉందా ?
ఒక నటుడిగా అన్ని రకాల సినిమాలు చేయాలి, అన్ని జోనర్స్ లో ప్రతిభని నిరూపించుకోవాలని వుంటుంది. క్లాస్ సినిమాలు విజయాలు ఇచ్చాయనే వాటికే పరిమితం కాకూడదు కదా. మాస్ సినిమాలు కూడా ప్రయత్నిస్తాను.
 
పాన్ ఇండియా అలోచలు ఉన్నాయా ?
మంచి కథ రావాలి. కథ లేకుండా ఏం చేయలేం. నిజానికి మంచి కంటెంట్ వున్న సినిమా తీస్తే పాన్ వరల్డ్ చూస్తారని నమ్ముతాను. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు డామినేటింగ్ గా వుంది. ఇలాంటి సమయంలో మేము ఈ ఇండస్ట్రీలో వుండటం అదృష్టంగా భావిస్తున్నా.
 
కొత్తగా చేయబోతున్న సినిమాలు
ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి షూటింగ్ పూర్తయ్యింది. విడుదల గురించి త్వరలోనే చెబుతా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నకేశవ రెడ్డి రీరిలీజ్‌కే కోటి అడిగారు: బెల్లంకొండ సురేష్