Webdunia - Bharat's app for daily news and videos

Install App

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

డీవీ
గురువారం, 31 అక్టోబరు 2024 (21:58 IST)
KA movie
నటీనటులు: కిరణ్ అబ్బవరం-తన్వి రామ్-నయన్ సారిక-అచ్యుత్ కుమార్-శరణ్య ప్రదీప్- రెడిన్ కింగ్స్లీతదితరులు 
సాంకేతికత:  ఛాయాగ్రహణం: సతీష్ రెడ్డి-డేనియల్ విశ్వాస్, సంగీతం: సామ్ సీఎస్  నిర్మాత: చింతా గోపాలకృష్ణరెడ్డి రచన-దర్శకత్వం: సుజిత్ మద్దెల-సందీప్ మద్దెల 
 
కిరణ్ అబ్బవరం నటుడిగా మంచి మార్కులు వస్తున్నా సరైన హిట్ దోబూచులాడుతుంది. ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రంతో సక్సెస్ ఖాతాలో వేసుకున్న కిరణ్ ఆ తర్వాత కొన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అలాంటి టైంలో కొంతగేప్ తీసుకుని పెండ్లి చేసుకున్నాక చేసిన సినిమా క. ఇందులో పోస్ట్ మ్యాన్ పాత్ర పోషించాడు. అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్ అంశం వుండడంతో ఇద్దరు దర్శకులు ఈ సినిమాకు పనిచేశారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
ఇది 80 నాటి కథగా చెప్పుకొచ్చారు. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఒక అనాథ. కానీ నలుగురు తనకు వుండాలనే కోరిక అతనిలో బలంగా వుంటుంది. అందుకే అనాథాశ్రమంలో పెరిగిన అతడికి వేరే వాళ్ల ఉత్తరాలు చదివి ఆనందపడుతుంటాడు. ఈ ఉత్తరాల ద్వారానే ఆ అనుబంధాల గురించి తెలుసుకుంటాడు. ఆ అలవాటు వల్లే పోస్ట్ మ్యాన్ అవ్వాలనుకుంటాడు.  వయస్సు వచ్చాక కృష్ణగిరి అనే ఊరిలో అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ గా జాబ్ వస్తుంది. అయినా ఉత్తరాలు చదివే అలవాటు పోదు. ఊరికి వచ్చే ఉత్తరాలన్నీ తెరిచి చదివి తెలివిగా వాటిని అతికించి ఇచ్చేస్తుంటాడు. అయితే ఈ అలవాటుతో కొన్ని షాక్ కలిగించే విషయాలు తెలుసుకుంటాడు. ఊరిలో అదృశ్యం అవుతున్న అమ్మాయిల గురించి తెలుసుకుని ఛేదించాలనుకుంటాడు.  ఆ తర్వాత అతనికి ఎదురైన సమస్యలేమిటి? కథ ఎటువైపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
దాదాపు పోస్ట్ మేన్ అనే బాజ్ వుందని ఈనాటి తరానికి తెలీని వారికి మరలా తెలియజేసే ప్రయత్నం దర్శకులు చేశారు. సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన తరుణంలో ఇలాంటి కథతో తీయడం సాహసమే. గతంలో మోహన్ బాబు వంటివారు హిందీలో పలు సినిమాలు వచ్చినా వాటిల్లో లేని అంశాన్ని ఇందులో దర్శకులు చూపించారు. కాపోతే ఈ తరహా మిస్టరీలు మలయాళంలో వర్కవుట్ అవుతాయి. అలా తెలుగులో తీయాలనే పట్టుదలతో కిరణ్ అబ్బవరం చేసిన ప్రయత్నమిది. 
 
 పల్లెటూరి నేపథ్యంలో ఒక థ్రిల్లర్ కథను దర్శక ద్వయం విజువల్ గా కొత్తగా ఉండేలా చేయడం క లో పత్య్రేకత. ఓ థ్రిల్లర్ కథను నరేట్ చేశారు సుజిత్-సందీప్. 'క'లో సాధారణ సినిమా కాకుండా కొంచెం భిన్నంగా తీయడంలో టైటిల్ నుంచే జాగ్రత్త పడ్డారు. క అనే టైటిల్ లోనే గమ్మతు వుండడంతోపాటు కథంతా అందులో వుండడంతో సరికొత్తగా అనిపించింది. పైగా ఇందులో మనిషి తాను చేసే ప్రతి కర్మకూ ఫలితం అనుభవించాల్సిందే అనేది ఇన్ డైరెక్ట్ గా చెప్పారు.  ఇదొక థ్రిల్లర్ కథ అయినా. లోతుల్లో చెప్పగలిగారు.
 
చాలా క్రైమ్ స్టోరీలకు సౌండ్ సిస్టమ్, ఆసక్తికలిగించే అంశాలతో కథన వుంటేనే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఆ పట్టుతెలిసిన మలయాళ ద్వయం సుజిత్-సందీప్ కూడా 'క'లో చూపించారు. వేరే వాళ్ల ఉత్తరాలు చదివి బంధాల విలువ తెలుసుకునే అనాథగా హీరో క్యారెక్టరైజేషన్ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ వున్నా పెద్దగా ఉపయోగపడదు. కాకపోతే నాయిక పాత్రే కథకు ట్విస్ట్. ఇంటర్ వెల్ వరకు కాస్త అటు ఇటుగా వున్నా ద్వితీయార్థంలో సినిమా రక్తికడుతుంది.  కథలో పలు షేడ్స్ వుండంతో ప్రేక్షకులు తర్వాత ఏం జరుగుతుందా అన్న ఆసక్తితో ముందుకు సాగుతారు. ట్విస్టులు ఎలా విప్పాలో దర్శకులు తెలుసుకుని ప్రేక్షకులను థ్రిల్ కలిగించారు. అసలు క అనేదానికి అర్థం చివరి అరగంటలోనే వుంటుంది. దాన్ని చూసి తెలుసుకోవాల్సిందే. దీనికి సీక్వీల్ కూడా తీయవచ్చు అనే ట్విస్ట్ ఇచ్చాడు. 
 
 కిరణ్ అబ్బవరం నటనాపరంగా బాగా కథకు సూటయ్యాడు. ఈ సినిమా నడిచే కాలానికి  పాత్రకు తగ్గ ఆహార్యంతో మెప్పించాడు. 'ఆయ్' ఫేమ్ నయన్ సారిక  నటనతో ఆకట్టుకుంది. మలయాళ నటి తన్వి రామ్ కూడా బాగా చేసింది. విలన్ పాత్రల్లో నటించిన ఇద్దరూ ఓకే. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ తన పాత్రను బాగా పోషించాడు.
 
ఇక సంకేతికంగా చూస్తే,  సామ్ సీఎస్ సంగీతం హైలైట్. ఒక డిఫరెంట్ థీమ్ తో సాగే ఆర్ఆర్ సినిమాలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయించడంలో కీలక పాత్ర పోషించింది. జాతర పాట మంచి ఊపుతో సాగుతుంది. సతీష్ రెడ్డి-డేనియల్ విశ్వాస్ అందించిన ఛాయాగ్రహణం బాగుంది. యశోధకు పార్ట్ నర్ గా చేసిన గోపాలక్రిష్ణ సోలో నిర్మాతగా చేసిన సినిమా ఇది. కథానాయకుడిగా కిరణ్ అబ్బవరంకు మరో మెట్టు ఎక్కించేలా వుందని చెప్పవచ్చు.
రేటింగ్:3/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

బీఆర్ఎస్ బాగా రిచ్ గురూ.. ఆ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు.. వామ్మో! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments