Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భయపెట్టించేలా C 202 మూవీ - రివ్యూ రిపోర్ట్

C 202 Movie

డీవీ

, శుక్రవారం, 25 అక్టోబరు 2024 (12:42 IST)
C 202 Movie
నటీనటులు :మున్నాకాశి, తనికెళ్ల భరణి, సత్య ప్రకాష్, షఫీ; శుభలేఖ సుధాకర్, అర్చన, చిత్రం శ్రీను, వై. విజయ, షరూన్ రియా ఫెర్నాండెస్, డ్రీమ్ అంజలి, సెల్వ (ఇక్బాల్), డాక్టర్ ఏవి గురవారెడ్డి తదితరులు
 సాంకేతికత: కెమెరా: సీతారామరాజు ఉప్పుతల, నిర్మాత : మనోహరి కెఏ, కథ స్క్రీన్ ప్లే మ్యూజిక్ ఎడిటర్ డైరెక్టర్ : మున్నాకాశి
 
కథ:
చేతబడులు చేసే బూరా (తనికెళ్ల భరణి) వల్ల C 202 ఇంట్లో హత్య జరుగుతుంది. అలాంటి ఇంటిలోకి శుభలేఖ సుధాకర్, అర్చన ల కుటుంబం వస్తుంది. వారికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి యుఎస్ లో ఉంటుంది. వాళ్లు తమ పెద్దమ్మాయి దగ్గరికి వెళ్తూ మిగతా ఇద్దరు కూతుళ్ళని ఇద్దరు స్నేహితులతో ఆ ఇంట్లో వదిలి వెళ్తారు. అందులో ఒక స్నేహితుడు మున్నాకాశి (అయాన్). ఆ తర్వాత ఇంట్లో వీరికి వింత రూపాలతో భయంకలిగించేలా వుంటాయి. అలాంటి సమయంలో మున్నా ఏం చేశాడు? అసలు శుభలేఖ సుధాకర్ కుటుంబం ఆ ఇంటికి ఎలా వెళ్లారు? అనే విషయాలకు సమాధానమే మిగిలిన సినిమా.
 
సమీక్ష:
హార్రర్ సినిమాలంటేనే చాలా ఉత్కంఠను కలిగించేలా, భయపెట్టేలా వుంటాయి. అందులో నటీనటులు ఎవరనేది అవసరంలేదు. కొత్తవారైతే మరీ థ్రిల్ గా వుంటుంది. ఇక ఈ సినిమాలో కొన్ని తెలిసిన వారు, కొంతమంది కొత్తవారు కావడంతో కేవలం ఇంట్లోనే ఎక్కువ భాగం కథ సాగడంతో సరికొత్తగా అనిపిస్తుంది. దర్శకుడు భయపెట్టేలా చేశాడు. సన్నివేశాలు అందుకు అనుగుణంగా వున్నాయి. అయితే మొదటి భాగంలో కొంత సాగదీతగా అనిపిస్తుంది. 
 
ఇందులో నటించినవారు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. మున్నాకాశి, షరూన్ రియా ఫెర్నాండెస్ మెప్పించే నటన కనబరిచారు. వారు భయపడుతూ భయపెట్టేవిధంగా చేయడం విశేషం. భూతాల రాజు గా తనికెళ్ల భరణి గారి క్యారెక్టర్ అమరింది. సత్య ప్రకాష్, షఫీ, వై. విజయ వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. మిగతా పాత్రలలో చిత్రం శ్రీను నటన కూడా మెప్పించాడు.
 
వీరంతా ఓ భాగమైతే ఇలాంటి కథకు సాంకేతిక కీలకం. అయితే ఈ సినిమాకు అన్నీ బాధ్యతలు తనేఅయి నడించిన మున్నా కాశిని అభినందించాలి. కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఎడిటింగ్, దర్శకత్వం వహించిన మున్నాకాశి పడిన కష్టం కనిపిస్తుంది. చిన్న సినిమా అయినా ప్రొడక్షన్ వైస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మాత మనోహరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నేపథ్య సంగీతం కథకు అనుగుణంగా కూర్చాడు.
 
హార్రర్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సన్నివేశపరంగా భీమ్స్ బాగా వుండాలి. అందుకు బాగా ట్రై చేశారు. మొదటిభాగంలో కాస్త కథనం నెమ్మదించింది.  దాంతో కొంచెం బోర్ కలిగించేవిధంగా అనిపిస్తుంది. అదేవిధంగా సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు కనెక్టివిటీ లోపంతో కాస్త కన్ఫ్యూజ్ కలుగుతుంది. ఇది ఎడిటింగ్ లోపించిన అంశమే. ఇటువంటి హార్రర్ సినిమాలు ఎలాగున్నా ఆసక్తికలిగించేలా వుంటాయి. ఆ ప్రయత్నం దర్శకుడు చేశాడు. హర్రర్ సినిమాల్ని ఇష్టపడే వారికి నచ్చుతుందనే చెప్పాలి.
రేటింగ్ :2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన అక్కినేని నాగార్జున