HIT 3 Movie Review: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT మూవీ రివ్యూ రిపోర్ట్

దేవి
గురువారం, 1 మే 2025 (12:27 IST)
HIT
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. 
 
ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే క్రేజ్ తెచ్చుకుంది. హిట్ పరంపరలో 3వ పార్ట్. నేడే విడుదలైంది. సినిమా ఎలా ఉందో చూద్దాం. 
 
కథ: ఎస్పీగా పదవి తీసుకున్న అర్జున్ సర్కార్ (నాని) సిటీకి దూరంగా క్రూరంగా మనుషుల్ని చంపే వారిని శోధించడానికి వెళతాడు. అయితే.. అసలు కిల్లింగ్ చేసింది అర్జున్ సర్కార్ అని తెలిసి అరెస్ట్ చేస్తారు. జైల్లో వేయగానే అతనిపై ఎటాక్ జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
మనిషిని హింసిస్తూ చంపడం అనేది సైకో బిహేవియర్. అంతకు మించి కత్తులతో నరకడం, లోపలి పార్ట్‌లు మాయం చేయడం ఈ కిల్లర్‌ పని. దీనికి డార్క్ వెబ్‌సైట్‌లో మెంబెర్స్ ఉంటారు. లోగడ తెలుగులోనే కొత్త హీరో, కం డైరెక్టర్ తీసాడు. కానీ అది ఎందుకో జనాలకు ఎక్కలేదు. ఇందులో నాని  నిర్మాత, కం హీరోగా చేయడం పబ్లిసిటీ చేయడం జనాలు రావడానికి ఉపయోగపడింది. 
 
ఇక క్రూరంగా చంపడం అనే దానికి పేటెంట్ తీసుకున్నట్లుంది ఈ సినిమా. ఇలా చంపడం వెనుక మెడికల్ మాఫియా ఉంది. దేశదేశాల్లో బిలియనీర్ల అవసరమైన మనిషి భాగాలు ఎలా ఉపయోగించుకుంటారనేది పేపర్ కటింగ్ రూపంలో చూపారు. నాని హింస మామూలుగా లేదు. హీరోగా తన పరిధిని చూపించాడు.
 
కిల్లర్‌లో సైకోలు ఎలాంటరో చెప్పారు. అలాగే పోలీస్‌లో సైకో‌లు హిట్‌ పేరుతో ఉంటారని చెప్పారు. అది ఎలా అనేది సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఇలా హింస చేయడం పురాణాల్లో చెప్పిన ఉపమానాలు చాగంటి ప్రవచనాలు చెప్పడం హీరోని వెలివేట్ చేశారు. దీనికి సీక్వెల్‌గా 4వ సినిమా వస్తుందని, కార్తి హీరోగా ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఇందులో ఇద్దరు హీరోలు కూడా కనిపిస్తారు.

సంగీతం, కెమెరా. బాగుంది.
రేటింగ్. 2.5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments