Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

Advertiesment
hero Priyadarshi

దేవీ

, మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (09:17 IST)
hero Priyadarshi
నలుగురిలో ఒకడిగా హీరో స్నేహితుడిగా పలు కేరెక్టర్లు పోషించిన ప్రియదర్శి జాతిరత్నాలు నుంచి ఓం భూం బుష్ సినిమాల్లో నటించి సక్సెస్ అయ్యాడు. ఇటీవలే విడుదలైన కోర్ట్ సినిమాలోనూ ఓ కేరెక్టర్ పోషించాడు. అయితే కథ పాతదే అయినా దాన్ని ఇప్పటి జనరేషన్ కు తీసుకెల్ళేలా టీజేన్ జంటను పెట్టి దర్శకుడు సక్సెస్ చేశాడు. నిర్మాత నాని కూడా ప్రమోషన్ లో బాగంగా కోర్ట్ బాగోకపోతే తాను హీరోగా చేస్తున్న హిట్ 3 సినిమా చూడొద్దు అంటూ ప్రకటించాడు.
 
ఇది పబ్లిసిటీలో భాగమైనా జనాలు నాని పై వున్న నమ్మకంతో థియేటర్లకు వచ్చారు. సక్సెస్ చేశారు. అయితే ఆ తర్వాత కథానాయకుడిగా నటించిన ప్రియదర్శి సినిమా సారంగపాణి జాతకంలో నటించాడు, ఇది శుక్రవారం విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన కలెక్షన్లతో ప్రారంభమైంది. రిలీజ్ రోజే థియేటర్లలో పెద్దగా స్పందనలేదు. కాకపోతే చూసినవారంతా బాగుంది. నవ్వుకున్నాం అన్నారు. అందుకు కారణం సపోర్ట్ యాక్టర్ వెన్నెల కిశోర్, వైవా హర్ష లు వుండడంతో ప్లస్ అయింది. కానీ ఇరగదీసే కలెక్లన్లు మాత్రం రాబట్టలేకపోయింది. 
 
కారణం దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతలు సరికొత్తగా కథనాన్ని చూపించకపోవడమే. క్లయిమాక్స్ సీన్ చాలా సినిమాల్లో వున్నదే. హిందీ సినిమాల్లోనూ ఆ ఎపిసోడ్ వుంది. కనుక కథలు ఎంచుకునేటప్పుడు దర్శకుడుకానీ, హీరోగానీ  జాగ్రత్తగా ఆలోచించాలి. కథనాన్ని మరింత కొత్తదనంతో చూపించాలి. అవి ప్రియదర్శికూడా  ఆలోచించాలి. అన్నీ వెరైటీ కథలే ఎంచుకుంటున్నానని అన్నా, కొన్ని ప్రేక్షకులకు కనెక్ట్ కాలేవు. సో. ప్రియదర్శి హీరోగా సినిమాలు చేయానుకుంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. సారంగపాణి.. చిత్ర ఇంటర్ వెల్ లో చూపించినట్లుగా సంకటం, సశేషం అన్నట్లుగా కాస్త హీరోగా గేప్ తీసుకోవాలేమో చూడాలి?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ