Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అతనొక్కడే' కాన్సెప్ట్‌కు 'అపరిచితుడు' మిక్స్.. ఇదే 'AAA' మూవీ కథ (రివ్యూ) (video)

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (13:07 IST)
మూవీ : అమర్ అక్బర్ ఆంటోనీ 
నిర్మాణ సంస్థ  : మైత్రీ మూవీ మేకర్స్
నటీనటులు : రవితేజ, ఇలియానా, సునీల్, లయ, అభిరామి, వెన్నెల కిషోర్, రవిప్రకాష్ తదితరులు 
సంగీతం : ఎస్ఎస్. థమన్
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్
దర్శకత్వం : శ్రీను వైట్ల  
విడుదల తేదీ : శుక్రవారం, నవంబరు 18, 2018
 
మాస్ మహారాజ్ రవితేజ - శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అమర్ అక్బర్ ఆంటోనీ". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఇలియానా ఆరేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ వెండితెరపై కనిపించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌లు సంయుక్తంగా నిర్మించారు. 
 
అటు హీరో రవితేజకు, ఇటు దర్శకుడు శ్రీను వైట్లకు భారీ డిజాస్టర్‌ల తర్వాత వచ్చిన చిత్రం 'ఏఏఏ'. రవితేజ ఖాతాలో 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్' వంటి చిత్రాలు, శ్రీను వైట్లకు 'ఆగడు', 'బ్రూస్‌లీ', 'మిస్టర్' వంటి చిత్రాలు భారీ పరాజయాల లిస్టులో ఉన్నాయి. ఇపుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'ట్రిబుల్ ఏ'. 
 
చిత్ర కథ : 
అమెరికాలో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫిడోకు ఇద్దరు స్నేహితులు యజమానులుగా ఉంటారు. వారిద్దరితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా రాజ్‌వీర్, విక్రమ్ తల్వార్, సాబుమీనన్‌, కరణ్ అరోరాలు చంపేసి కంపెనీని హస్తగతం చేసుకుంటారు. కానీ, వీరి దాడి నుంచి ఆ ఇద్దరు స్నేహితుల పిల్లలతో పాటు వారి స్నేహితుడు జలాల్ (షాయాజీ షిండే)లు మాత్రం ప్రాణాలతో బయటపడతారు. ఈ క్రమంలో అమర్ (రవితేజ) 14 యేళ్ల జైలుశిక్ష తర్వాత జైలునుంచి విడుదలవుతాడు. జైలు నుంచి వచ్చీరాగానే రాజ్‌వీర్‌ను చంపేస్తాడు. 
 
ఇక తమను కూడా చంపేస్తాడని భయపడిన మిగిలిన ముగ్గురు ఓ పోలీసు అధికారి (అభిమన్యుసింగ్)ను ఆశ్రయిస్తారు. వారికి ఆయన హామీ ఇచ్చి.. హంతకుడి కోసం గాలింపు మొదలుపెడుతాడు. ఇదిలావుంటే అమెరికాలో వాటా అనే తెలుగు సంస్థకు అధ్యక్షుడు పుల్లారెడ్డి (జయప్రకాష్ రెడ్డి) ప్రతి యేటా తెలుగు ప్రముఖులను పిలిచి సన్మానిస్తుంటాడు. ఈయన వద్ద గండికోట (రఘుబాబు), మిర్యాల చంటి (వెన్నెల కిషోర్), కందుల (శ్రీనివాస్ రెడ్డి), చేతన్ శర్మ (గిరిధర్)లు సహాయకులుగా ఉంటూ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటారు. వీరిలో చేతన్ శర్మ మాత్రం మంచివాడు. 
 
మిగిలిన ముగ్గురు మాత్రం ఈవెంట్‌కు వచ్చిన వారి వద్ద డబ్బులు భారీ మొత్తంలో వసూలు చేసి, వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఈక్రమంలో ఈవెంట్‌కు వచ్చిన అక్బర్ (రవితేజ) వారి ఆటలు కట్టిస్తాడు. అలాగే, ఈవెంట్ మేనేజర్‌గా ఉన్న పూజను మిర్యాల చంటి ప్రేమిస్తాడు. కానీ, పూజకు ఓ మానసికరోగం ఉంటుంది. దీనికి చికిత్స చేసేందుకు డాక్టర్ ఆంటోనీ (రవితేజ) వద్దకు మిర్యాల తీసుకెళతాడు. అక్కడ ఆంటోనీ చూడగానే వీరంతా గందరగోళానికి గురవుతారు. ఆ తర్వాత అమర్, అక్బర్, ఆంటోనీలు ఒకరేనని తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు.. అసలు అమర్.. అక్బర్, ఆంటోనీలా ఎందుకు ప్రవర్తిసుంటాడు అనేది తెరపై చూడాల్సిందే.
 
విశ్లేషణ 
ముందుగా నటీనటుల విషయానికి వస్తే రవితేజ తన బాడీ లాంగ్వేజ్‌తో ఫుల్ ఎనర్జిటిక్‌గా నటించాడు. మూడు పాత్రలను చక్కగా చేశాడు. అయితే, ఇందుకోసం రవితేజ పెద్దగా కష్టపడింది లేదని చెప్పొచ్చు. ఎందుకంటే హీరో బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా మూడు పాత్రలను దర్శకుడు శ్రీనువైట్ల డిజైన్ చేశాడు. ఇకపోతే, ఆరేళ్ళ తర్వాత కనిపించిన ఇలియానా బొద్దుగా కనిపించడమేకాకుండా తన డబ్బింగ్ తనే చెప్పుకుంది. కానీ, డాన్సులు మాత్రం మునుపటిలా చేయలేక పోయింది. 
 
ఇక విలన్స్‌గా నటించిన తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, విక్రమ్ జీత్, రాజ్‌వీర్‌ పాత్రల్లో గొప్ప విలనిజం అయితే కనిపించదు. వీరి పాత్రల డిజైనింగ్‌లో దర్శకుడు పెద్దగా దృష్టిపెట్టలేదు. మిగిలిన పాత్రధారులైన షాయాజీ షిండే, లయ, అభిరామి, అభిమన్యు సింగ్ తదితరుల పాత్రలకు మాత్రం న్యాయం చేశాడు. ఇక హాస్యానికి వస్తే వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబులు తెలుగు అసోసియేషన్స్ సభ్యులుగా చేసిన కామెడీ, అప్పుల బాబుగా సునీలు చేసిన కామెడీ, జూనియర్ పాల్‌గా సత్య పండించిన హాస్యం సూపర్బ్‌గా లేకపోయినా ఫర్వాలేదనిపిస్తోంది.
 
ఇకపోతే, దర్శకుడు శ్రీనువైట్ల రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. ఏం చెప్పదలచుకున్నాడో క్లారిటీ లేదు. గతంలో వచ్చిన అతనొక్కడే కాన్సెప్ట్‌కు అపరిచితుడు మిక్స్ చేసి ఓ కథను రాసుకున్నట్టుగా ఉంది. ఇలాంటి కథను రవితేజ అంగీకరించడం వెనుక కారణం తెలియదు. వాస్తవానికి శ్రీనువైట్ల - రవితేజ కాంబినేషన్‌లో వచ్చే చిత్రంలో హాస్యం పూర్తిస్థాయిలో ఉంటుందని వెళ్లే ప్రేక్షకుడు నిరాశపడాల్సిందే. కథలో కొత్తదనం లేకపోవడం, థమన్ పాటలు వినసొంపుగా లేకపోవడం మైనస్‌ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ చిత్రానికి హైలెట్‌గా ఉంది. చిత్ర నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments