Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ‌డావుడి మిన‌హా అల‌రించ‌ని అలీ- బ్ర‌హ్మీ కాంబినేష‌న్‌

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (13:25 IST)
Ali- bramhi
సినిమాల్లో అలీ, బ్ర‌హ్మానందం న‌టిస్తే వారి కాంబినేష‌న్ చూసేవారికి ఎంతో ఆహ్లాదాన్ని క‌లిగిస్తుంది. వారిది హిట్ కాంబినేష‌న్‌గా చాలా సినిమాలు వ‌చ్చాయి. క‌ట్‌చేస్తే, ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ఇంట‌ర్వ్యూ చేసుకోవాల్సి వ‌స్తే చూసే వాడికి క‌ష్ట‌మే. ఇటీవ‌లే అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మం మొద‌లైంది. స‌హ‌జంగా ఆర్టిస్టులు వస్తే వారిని సాద‌రంగా ఆహ్వానిస్తుంటారు. ప్ర‌ముఖులు మోహ‌న్‌బాబు ఇత‌ర‌త్రా లాంటివారు వ‌స్తే రిసీవింగ్ వేరుగా వుంటుంది.
 
మొన్న జ‌రిగిన బ్ర‌హ్మానందం ఎపిసోడ్ రిసీవింగ్ అంతే ఆర్భాటంగా జ‌రిగింది. పూల వాన‌ను త‌ల‌పించేట్లుగా ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికాడు అలీ. టీవీ నిర్వాహ‌కులు కూడా అందుకు స‌హ‌క‌రించారు. ఇక పిచ్చాపాటీ మొద‌లు పెట్టాక కార్య‌క్ర‌మం ఎటుపోతుందో అర్థంకాలేదు. చాలా అనాస‌క్తిగా సాగింది. నాకు అలీ ఫోన్ చేసి.. ఏరా.. ఏం చేస్తున్నావ్ అంటాడు.. అంటే పెద్ద‌త‌నం అనేది లేదు. అంటూ స‌ర‌దా మాట‌లు త‌ప్పితే.. అస‌లు బ్ర‌హ్మానందంలోతుల్లో వున్న విష‌యాలు బ‌య‌ట‌కు రాలేదు. 
 
ఫైన‌ల్ గా మోహ‌న్‌బాబు ఎపిసోడ్‌లా.. ఈసారి ఇంకా పూర్తిగా మీతో గ‌డ‌ప‌డానికి కుద‌ర‌లేదు. వ‌చ్చేవారం మ‌ర‌లా క‌లుద్దాం అంటూ అలీ ముగించాడు. ఇలా ఎన్ని వారాలు చూపిస్తావ్‌. చూసేవాడికి బోర్ కొడుతుంది. వీరికి ప‌నేలేదా అనుకుంటారు అని బ్ర‌హ్మి సెటైర్ కూడా వేశారు. దానికి త‌గ్టట్లే ఈ ఎపిసోడ్ వుందనే టాక్ కూడా వుంది.
 
ఇక వ‌చ్చేవారం ఎపిసోడ్ ఎలా వుంటుందో కాస్త ట్రైల్ చూపించాడు. ఎంతో బిజీగా వుండే మీరు ఒక్క‌సారిగా ఎందుకు వెనుక‌బడ్డారు. అన్న ప్ర‌శ్న ప్రోమోలో అలీ వేస్తే, దానికి బ్ర‌హ్మి.. క‌ళ్ళ‌జోడు ప‌క్క‌న ప‌డేసి.. ఒక్క‌సారిగా లేచి వెళ్ళిపోవ‌డం చూపించాడు.. అంటే ఏదో జ‌ర‌గ‌బోతుంద‌నే ఆశ క‌లిగించాడు. ఫైన‌ల్‌గా ఇది ఫేక్ అంటూ బ్ర‌హ్మి తిరిగి వ‌స్తాడ‌ని తెలుస్తోంది. 

- ఎందుకంటే గ‌తంలో ఇలానే మంచు విష్ణుతో మాట్లాడుతూ, మ‌నోజ్‌కూ నీకు ప‌డ‌దంట‌గా కార‌ణం? అని అలీ అడిగి వెంట‌నే విష్ణు ఒక్క‌సారిగా సీరియ‌స్‌గా లేచి కోటును స‌రిచేసుకుంటూ ముందుకు సాగాడు. క‌ట్ చేస్తే మ‌ర‌లా వెన‌క్కి వ‌చ్చి కూర్చున్నాడు. 
సో.. ఇలాంటి జిమ్మిక్కులు మిన‌హా బ్ర‌హ్మిలాంటి వారిని చూసే ప్రేక్ష‌కుడికి కొత్త విష‌యాలు, ఏవైనా మంచి మాట‌లు ఇలాంటి ప్రోగ్రామ్ నుంచి ఆశించ‌డం అత్యాశే నంటూ చూసే ప్రేక్ష‌కులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments